Shanaya Kapoor:షనాయా కపూర్ …బాలీవుడ్ యంగ్ బ్యూటీ మరోసారి తనదైన గ్లామర్ ఫోటో షూట్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో చేస్తూ అభిమానులను అలరించే ఈ ముద్దుగుమ్మ, తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేసిన స్టైలిష్ అవుట్‌ఫిట్ తో ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.ఇక ఈ ఫొటోలకు షనాయా ‘darkly, delicately.’ అనే క్యాప్షన్ ఇవ్వడం ఇక్కడ విశేషం.
ఫ్యాషన్ విషయంలో సరికొత్త ఎక్స్పరిమెంట్స్ చేసే షనాయా కపూర్, ఈసారి వైట్ హై నెక్ టాప్‌కు బ్లాక్ డిజైన్‌ను జోడించిన అవుట్‌ఫిట్, దానికి మ్యాచ్ అయ్యే బ్లాక్ అండ్ వైట్ ట్రౌజర్స్ వేసి ఫ్యాషన్ లవర్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ఎలాంటి హడావుడి లేని మేకప్,హెయిర్ స్టైల్, కెమెరా వైపు చూస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఈ ఫోటోషూట్‌లో మెయిన్ హైలైట్‌గా నిలిచాయనే చెప్పాలి.
సాధారణంగా గ్లామరస్ ఫోటోషూట్స్‌లో కనిపించే తీరుకి భిన్నంగా ఈసారి షనాయా ఒక ఇంటర్నేషనల్ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్‌పై కనిపించే మోడల్‌లా మెరవడం ఇక్కడ విశేషం. ముఖ్యంగా వెనుక ఉన్న డార్క్ బ్లూ బ్యాక్‌గ్రౌండ్ ఆమె ధరించిన దుస్తుల రంగులను మరింత అందంగా హైలైట్ చేసిందనడంలో సందేహం లేదు.
నిజానికి సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫ్యాషన్ ఫొటోలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుందని కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే కేవలం ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు వేయడం మాత్రమే కాకుండా వాటిని ఎంత కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తున్నారన్నదే ముఖ్యం.ఈ విషయంలో షనాయా రెండాకులు ఎక్కువ చదివిందనే చెప్పాలి.ఇక తను పెట్టిన ‘డార్క్లీ, డెలికేట్లీ’ అనే క్యాప్షన్ కూడా ఈ ఫొటోలకు పర్ఫెక్ట్ సెట్ అయిందంటూ కామెంట్స్ వదులుతున్నారు ఫాన్స్.
ఇక సినిమాల విషయానికి వస్తే, షనాయా కపూర్ కెరీర్ మెల్లిగా పికప్ అందుకున్నట్టే కనిపిస్తుంది. ప్రముఖ నటుడు సంజయ్ కపూర్, మహీప్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, తనకంటూ సపరేట్ ఇమేజ్ తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తుంది.
అందులో భాగంగా విక్రాంత్ మాస్సేతో కలిసి నటించిన ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బీ టౌన్ బ్యూటీ ఆ తర్వాత ఆదర్శ్ గౌరవ్‌తో కలిసి ‘తు యా మైన్’ చిత్రంలో నటించి రొమాన్స్‌తో పాటు థ్రిల్లర్ జానర్‌లోనూ తన టాలెంట్‌ను నిరూపించుకోవడం విశేషం.
అంతేకాదండోయ్..మన తెలుగు ప్రేక్షకులకు కూడా షనాయా త్వరలో మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది.అవును .. తేజ సజ్జా హీరోగా తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జంబి రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్’ సినిమాలో ఆమె పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఈ సినిమా ద్వారాగనుక ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం సౌత్ లో ఆమె క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.చూడాలి మరి తనదైన గ్లామర్ ట్రీట్ తో ఆడియన్స్ ని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సినిమలాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !
ALSO READ :ఏం సాంగ్ భయ్యా ఇది.. మైండ్ పోతుంది ! అప్పుడే పది లక్షల వ్యూస్