Star Actress: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. వాస్తవానికి అభిమానుల మధ్య గొడవలు ఉన్నా.. సెలబ్రిటీలు మాత్రం చక్కగా ఎదురుపడినప్పుడు కలుసుకోవడం లేదా ప్రత్యేకంగా ఒక సందర్భాన్ని పెట్టుకొని మరీ ఒక దగ్గర కలవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 90స్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్లు.. తాజాగా రీ యూనియన్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ తారలంతా ఒకే చోట చేరి.. ఆ అద్భుతమైన ఫ్రేమ్ ను అభిమానులతో పంచుకున్నారు.
రీ యూనియన్ పేరిట సందడి చేస్తున్న సెలబ్రిటీలు..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రతి ఏడాది 90వ దశకంలో స్టార్డం పొందిన సినీ ప్రముఖులు ఒకచోట కలుసుకొని రీ యూనియన్ పార్టీ చేసుకోవడం ఇప్పుడు ఒక ట్రెడిషన్ గా మారింది. అయితే ఈ ఏడాది గోవా వేదికగా మారింది. అక్కడ చోటు చేసుకున్న జాయ్ ఫుల్ మూమెంట్స్, సెలబ్రిటీల సందడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ పార్టీకి సంగీత, సంఘవి, మీనా, సిమ్రాన్, శ్వేతా మీనన్, రీమాసేన్, మహేశ్వరి లాంటి పాపులర్ హీరోయిన్స్ హాజరయ్యారు.
ఒకే చోట చేరిన సీనియర్ హీరోయిన్స్..
ఇక వీరే కాకుండా డైరెక్టర్లు శంకర్, కె ఎస్ రవికుమార్, లింగుస్వామి, మోహన్ రాజా, కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ ప్రభుదేవా వంటి స్టార్లు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి శ్రీకాంత్ , జగపతిబాబు వంటి ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనడం గమనార్హం. అప్పటి స్నేహ బంధాలను, అప్పటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. ఇకపోతే తాజాగా ట్విట్టర్ వేదికగా సీనియర్ హీరోయిన్ మీనా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో మీనా, ఊహ, సంగీత, మహేశ్వరి, సిమ్రాన్, సంఘవి, శ్వేతా మీనన్ కలిసి ఒకే చోట దిగిన ఫోటోలను మీనా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ తరగని అందం ఆమె సొంతం..
ఇకపోతే ఈ ఫోటోలలో మీనాను చూసి, ఆమె అందానికి అభిమానులు ముగ్ధులు అవుతున్నారు. ఇప్పటికి ఆమె అందంలో ఏ మార్పు రాలేదు అని కామెంట్లు చేస్తున్నారు. అటు సంగీత, మహేశ్వరి వంటి హీరోయిన్లు కూడా తమ అందంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ హీరోయిన్లలో కొంతమంది మాత్రమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక అందులో మీనా, సిమ్రాన్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే.
ALSO READ:Kingdom OTT: కింగ్డమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే..ఎక్కడ చూడచ్చంటే?
90s Stars, Timeless Bonds 🤍✨#Meena pic.twitter.com/xj9wq4AIHk
— Meena (@ActressMeena_) July 30, 2025