Intinti Ramayanam Today Episode july 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్కడకు వచ్చిన పెళ్లికొడుకు గదులన్నీ వెతుకుతూ అనుమానంగా తిరుగుతూ ఉంటాడు. అయితే అతన్ని చూసిన అవని ఎవరు కావాలి ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. వాష్ రూమ్ కి వచ్చాను అని అంటాడు. అసలు నేనెవరో ఈ ఫంక్షన్ తర్వాత మీకే తెలుస్తుంది అని అతను అంటాడు. అయితే అవినీతో ఆ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న మీద అనుమానం మొదలవుతుంది. ప్రణతి భరతుల పెళ్లి విషయం ఎలాగైనా ఆటంకం కలగకుండా చెప్పాలి అని అనుకుంటుంది. అక్కడికి వచ్చిన పంతులు ఆలస్యమైనందుకు క్షమించాలి అని ఆ రోజు గురించి గొప్పగా చెప్తాడు.. ఇక పూజకి అన్ని సిద్ధం చేయమని చెప్తాడు. అలాగే పూజ కూర్చోవాల్సిన దంపతులు కూడా అన్ని సిద్ధం చేసుకుని ఉండాలని అంటాడు.
అక్షయ్ వెళ్తుంటే పార్వతి పిలుస్తుంది. నువ్వు అవనిని దూరం పెట్టి చాలా మంచి పని చేశావు. అవనిని దగ్గరికి రానివ్వకుండా చేయడం మంచిదిరా అని సలహాలిస్తూ ఉంటుంది.. అయితే అవనికి దగ్గరగా ఉండడం నాకు ఇష్టం లేదమ్మా కేవలం నీ ఫంక్షన్ కోసమే ఇక్కడికి వచ్చాము అని అంటాడు. నాకు తెలుసు రా నీకు అవని అంటే ఇష్టం లేదు అని అని పార్వతి అంటుంది. ఆ మాట విన్న రాజేంద్రప్రసాద్ నేను కూడా నువ్వు లేకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అమ్మ అవని మనం ఇక వెళ్ళిపోదాం పదండి మీ అత్తయ్య ఒక్కటే ఫంక్షన్ చేసుకుంటుంది అని అంటాడు. పల్లవి మాటతో ఆగిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీ అందరికి ఒక విషయం చెప్పాలి అని పార్వతి అందరితో అంటుంది. ఫంక్షన్ అయిన తర్వాత మీరు ఎవరు నా మాట కాదని అంటారని అనుకుంటున్నాను అని పార్వతి అంటుంది. రాజేంద్రప్రసాద్ మాట ఇస్తారని లాక్ చేస్తున్నావని అడుగుతాడు. లేదు నా మాటను కాదనుకున్న ఉంటారని అడుగుతున్నానని అంటుంది. దానికి అవని అత్తయ్య అందరిని ఈ ఫంక్షన్ ద్వారా కలిపింది. తను తీసుకుని నిర్ణయం కూడా మంచిదే ఉంటుంది మేమెవరము మీకు మాటిస్తున్నాను కాదనము అని అవని అంటుంది. అవని వదిన మాటిస్తే తప్పదు అని కమల్ అంటాడు. పల్లవి కూడా అవని అక్క మాట ఇచ్చిందంటే అది కచ్చితంగా జరుగుతుంది అత్తయ్య మీరేమి టెన్షన్ పడకండి అని అంటుంది.
అవని కట్టుకునే చీరకి దురదల స్ప్రే కొడుతుంది పల్లవి. అవి నీకు రావాల్సిన దురదలు పల్లవికి రావడంతో షాక్ అవుతుంది. అయితే పల్లవి పూజ మధ్యలో గీక్కుంటూ నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి చీర మార్చుకొని అక్కడికి వస్తుంది. ఏమైంది అని అడిగితే ఏం కాలేదు అని అంటుంది. ఇదంతా అవని పని అని అనుకుంటుంది. పూజ అయిన తర్వాత పైకి వెళ్లి దురదలు ఎక్కువ అవ్వడంతో గీక్కుంటూ ఉంటుంది. కమల్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. దురదలు వస్తున్నాయి. ఏదో అయ్యింది నాకు అర్థం కావట్లేదు అని మ్యానేజ్ చేస్తుంది. తప్పు చేసావని కమల్ అడుగుతాడు. అవనిని పిలిచి ఏదో జరిగింది చూడు వదిన అని చెప్పి వెళ్తాడు.
అవని నాకోసం దురదల స్ప్రే ని ఆన్లైన్లో ఆర్డర్ చేశావు నాకు తెలియదని అనుకుంటున్నావా అని పల్లవికి షాక్ ఇస్తుంది. ఆ మాట వినగానే పల్లవి మైండ్ బ్లాక్ అవుతుంది.. నా చీరకి డూప్లికేట్ని స్ప్రే చేసేలా చేసాను. నీ చీరకి ఒరిజినల్ స్ప్రే ని చేశాను అని అవని అంటుంది. ఇలాంటివి మళ్లీ చేసావనుకో ఈసారి మామూలుగా ఉండదు నీకు అని అంటుంది. చివర్న దురదలు తగ్గడానికి ఆయింట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
కిందకి వెళ్ళిన తర్వాత అత్తయ్య మీరేదో చెప్పాలి అనుకున్నారు కదా ఆ విషయాన్ని చెప్పండి అని అడుగుతారు అందరూ.. పార్వతి మీకు ఇందాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కదా అదే ఇప్పుడు చెప్పబోతున్నానని అంటుంది. ఏంటి ఆ విషయమని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఇందాక నాకు కావలసిన వాళ్ళని చెప్పాను కదా వాళ్ళు మనతో వియ్యం అందుకోవడానికి వచ్చారని చెప్తుంది. ప్రణతిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి వచ్చాడు అని రివిల్ చేస్తుంది. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
Also Read :
అవని రాజేంద్రప్రసాద్ ఎంత చెప్తున్నా సరే పార్వతీ మాత్రం వినకుండా.. నా కూతురు జీవితం నా ఇష్టం అంటూ వాదిస్తుంది. ప్రణతి నా ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏ సంబంధం తెచ్చిన నేను చేసుకోను అని తెగేసి చెప్పేస్తుంది. పార్వతి మాత్రం నీకేం తెలీదు నువ్వు చిన్నపిల్లవి నేను చెప్పినట్లే నువ్వు వినాలి అని రచ్చ రచ్చ చేస్తుంది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ నా కూతురు ఇష్టప్రకారమే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. నీకు ఎంత అధికారం ఉందో నా కూతురు విషయంలో నాకు అంతే అధికారం ఉంది అని అంటాడు. అవని అడిగితే నా కూతురు పెళ్లి చేసుకోవడానికి నీ పర్మిషన్ తీసుకోవాలని రెచ్చిపోతుంది. మొత్తానికి గొడవ అయితే గట్టిగానే జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..