BigTV English

Ambati Arjun : ‘పెద్ది’ స్టోరీ లీక్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే..!

Ambati Arjun : ‘పెద్ది’ స్టోరీ లీక్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే..!

Ambati Arjun : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కబోతుంది. అయితే ఇప్పటికే 30 శాతం పూర్తి కాగా.. రామ్ చరణ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ భారీ ట్రైన్ సెట్ వేశారు. అందులో యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలెట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ అటెంప్ట్ చేయని విధంగా ఈ మూవీ రాబోతుంది.. అయితే ఈ మూవీలో సీరియల్ యాక్టర్ అర్జున్ అంబటి ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మూవీ స్టోరీని లీక్ చేశాడు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.


‘పెద్ది’ లో రామ్ చరణ్ ఎలా ఉంటాడంటే..?

సీరియల్ హీరో అర్జున్ అంబటి ఇటీవల బిగ్ బాస్ లో సందడి చేశారు.. విన్నర్ అవుతాడని అందరు అనుకున్నారు. కానీ ఎలిమినేట్ అయ్యాడు. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చాక బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో సందడి చేస్తున్నారు. అలాగే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అర్జున్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టీజర్ లో కేవలం కొన్ని మాత్రమే చూపించారు. ఇలాంటివి ఇంకా చాలా షాట్లు సినిమాలో ఉన్నాయి. చరణ్ ఫాన్స్ కి పెద్ద పండగనే చెప్పాలి. మూవీ మొత్తం రామ్ చరణ్ హైలెట్ గా నిలుస్తాయని చెప్పారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Also Read:గురువారం టీవీ ఛానెల్స్ లోకి వచ్చే సినిమాలు.. ఆ రెండు కన్నీళ్లు పెట్టిస్తాయి..

“పెద్ది” మూవీ షూటింగ్ అప్డేట్..

ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16 వ సినిమాగా పెద్ది మూవీ రాబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ నిరాశ పరచడంతో ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. జాన్వీ జూలై 12 నుంచి ‘పెద్ది’ తిరిగి జాయిన్ కానుందని.. దాదాపు ఈ సినిమాకు సంబంధించి 40 రోజుల చిత్రీకరణ మిగిలి ఉండగా.. ఆ సమయంలో జాన్వీపై కీలకమైన సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్స్‌తో పాటు రెండు పాటలను చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీ విడుదల కాబోతుంది.

Related News

Rishabh Shetty: బాయ్ కాట్ కాంతార.. రిషబ్ తీరు పై నెటిజన్స్ ఫైర్!

Animal Park Update : సందీప్ రెడ్డి యానిమల్ పార్క్‌పై హీరో సాలిడ్ అప్డేట్… రిలీజ్ డేట్ కూడా.!

Chiranjeevi: మాట్లాడడానికి ఏం లేదు.. బాలయ్య వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన మెగాస్టార్‌

OG Movie Tickets : టికెట్ కొంటే బిర్యానీ ఫ్రీ… పవన్ మూవీకి ఇవేం తిప్పల్రా సామి

CV Anand Press Meet: రిలీజ్ కాకముందే ఆన్ లైన్‌లో ఎలా వస్తుందంటే? పైరసీ గ్యాంగ్‌పై CV ఆనంద్ షాకింగ్ నిజాలు

Sudigali Sudheer: పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌తో వస్తున్న సుడిగాలి సుధీర్‌.. టైటిల్‌ ఇదే!

Kayadu Lohar: కరూర్ తొక్కిసలాట ఘటనలో కయాదు ఫ్రెండ్ మృతి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.

OG Piracy: ఓజీని పైరసీ చేసిన ముఠా అరెస్ట్… హార్డ్ డిస్క్‌లన్నీ స్వాధీనం

Big Stories

×