Arundhati Child Artist: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) నటించిన అరుంధతి (Arundhathi)సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో అనుష్క నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నగేష్(Divya Nagesh) నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.. జేజమ్మ పాత్రలో ఒదిగిపోయి తన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించారని చెప్పాలి. ఇలా చిన్నప్పటి జేజమ్మ పాత్రలో అద్భుతంగా నటించిన దివ్య నగేష్ అనంతరం పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన నటి..
ఇక ఈమె పెరిగి పెద్దయిన తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారని చెప్పాలి. ఇలా సినిమాలకు దూరంగా ఉన్న దివ్య నగేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మొదట్లో ఈమె నిశ్చితార్థం చేసుకుని తన పెళ్లి విషయాన్ని అందరికీ తెలియజేశారు. దివ్య నగేష్ గత ఐదు సంవత్సరాల పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్ (Ajay Kumar)ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
అజయ్ కుమార్ తో ఏడడుగులు వేసిన దివ్య నగేష్..
ఆగస్టు 18వ తేదీ ఈమె వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఈ ఇద్దరు ఎక్కడ అధికారకంగా షేర్ చేయకపోయిన ఈమె పెళ్లి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా తన ప్రియుడితో సాంప్రదాయ బద్ధంగా వీరి వివాహ వేడుకలు జరిగాయని తెలుస్తోంది. ఇక పెళ్లికి ముందు దివ్య నాగేష్ తమ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు అలాగే ఎంతో ఘనంగా బ్యాచిలర్ పార్టీని కూడా జరుపుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన దివ్య నగేష్ తాజాగా ప్రియుడు అజయ్ కుమార్ తో మూడు ముళ్ళు వేయించుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
సేవమ్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ..
ఇలా జేజమ్మ పెళ్లి చేసుకుందనే విషయం తెలియడంతో అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక దివ్య నగేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన అనంతరం హీరోయిన్ గా కూడా పలు మలయాళ సినిమాలలో నటించారు. ఈమె తెలుగులో నాన్న నేను ఓ అబద్ధం అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా సినిమాలలో హీరోయిన్గా సక్సెస్ అందుకోని నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఇక ఈమె 2014లో సేవమ్ అనే తమిళ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ అరుంధతి సినిమా మాత్రం తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఇలా చిన్నప్పటి జేజమ్మగానే అందరికీ గుర్తుండిపోయిన దివ్య నగేష్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Producer SKN: ఇది సమ్మె కాదు.. నిర్మాతలకు సమ్మెట పోటు..తమ్మారెడ్డికి ఎస్కేఎన్ కౌంటర్