Producer SKN: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. అయితే ఈ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించడంతో త్వరలోనే పరిష్కారం లభిస్తుందని స్పష్టమవుతుంది. ఇకపోతే గత 16 రోజుల నుంచి కార్మికులు తమకు 31% వేతనాలు పెంచాలి అంటూ షూటింగులను నిలిపివేసి సినీ కార్మికులు స్ట్రైక్ (Cine Workers Strike)చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కార్మికులకు 31% వేతనాలను పెంచలేమని తెలిపారు. డిమాండ్ చేసినంత వేతనాలు పెంచితేనే షూటింగ్స్ జరుగుతాయని లేకపోతే షూటింగ్స్ అడ్డుకుంటామంటూ ఫెడరేషన్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.
16 వ రోజుకు చేరుకున్న సమ్మె…
ఇలా 16 రోజుల నుంచి ఈ విషయంపై సరైన స్పష్టత రాని సమక్షంలో ఎన్నో పెద్ద సినిమాల షూటింగ్స్ ఆగిపోవడం వల్ల నిర్మాతలు(Producers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ (Thammareddy Bhardwaj)మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తాజాగా ఈయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికులు చేస్తున్న స్ట్రైక్ గురించి మాట్లాడారు అదేవిధంగా ఈ విషయంపై నిర్మాతల అభిప్రాయాలు గురించి కూడా తమ్మారెడ్డి మాట్లాడారు.
నిర్మాతలే షూటింగ్స్ ఆపివేశారు…
సినిమా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి స్ట్రైక్స్ జరగడం సర్వసాధారణమని తెలిపారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి సమ్మెలు జరుగుతాయని గతంలో 50 రోజుల పాటు సమ్మె జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే ఎప్పుడూ లేనివిధంగా ఈసారి కార్మికులకు బదులుగా నిర్మాతలు సినిమా షూటింగ్స్ ఆపేస్తున్నారని ఇలాంటి వింత ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగదు ఒక్క హైదరాబాదులోనే జరుగుతుంది అంటూ ఈయన మాట్లాడారు. ఇలా సమ్మె చేయడం వల్ల కార్మికుల పొట్టపై కొట్టినట్టు అవుతుంది. అందుకే ఇరువురు ఈ విషయంపై చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని, తమ్మారెడ్డి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Dearest Thamma Reddy sir
ప్రియమైన అయ్యా ఈ ఆకస్మిక సమ్మె మరియు ఆర్థిక బ్లాక్ మెయిల్ కి పిలుపునిచ్చింది యూనియన్స్ వారు కానీ నిర్మాతలు కాదు అని మీకున్న సమాచార లోపాన్ని సరిదిద్దటానికి ఈ పోస్ట్
ఇదిగో సడన్ సమ్మె కి యూనియన్స్ వారు పంపినా నోటిస్
ఇది నిర్మాతలు కోరుకొన్న సమ్మె కాదు వారి… pic.twitter.com/McfZo2i2Zu— SKN (Sreenivasa Kumar) (@SKNonline) August 19, 2025
తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నిర్మాత ఎస్ కే ఎన్(SKN) సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే కార్మికులు వేతనాలను పెంచమని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు కానీ తమ్మారెడ్డి మాత్రం ప్రొడ్యూసర్లే సమ్మె చేస్తున్నారని మాట్లాడటంతో ఈయన స్పందించారు.” ప్రియమైన అయ్యా ఈ ఆకస్మిక సమ్మెకు, ఆర్థిక బ్లాక్ మెయిల్ కి పిలుపునిచ్చింది యూనియన్స్ వారు కానీ నిర్మాతలు కాదు. పొరపాటున మీరు సమాచార లోపంతో మాట్లాడిన ఈ మాటలను సరిదిద్దటానికి ఈ పోస్ట్. ఇదిగో సడన్ సమ్మె కి యూనియన్స్ వారు పంపినా నోటిస్..
ఇది నిర్మాతలు కోరుకొన్న సమ్మె కాదు వారి తల మీద బలవంతపు సమ్మెట పోటు అని గుర్తించ వలసిందిగా మనవి” అంటూ సమ్మెకు యూనియన్ వారు పంపించిన నోటీసును జత చేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు వేతనాలను పెంచలేమని చెబుతున్నారు .ఇలాంటి తరుణంలో నిర్మాతలే సమ్మెకు పిలుపునిచ్చారంటూ తమ్మారెడ్డి మాట్లాడటంతో ఎస్కేఎన్ స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Also Read: Jr. NTR: ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన సింగర్… మనకు ఆ పరిస్థితి రావచ్చు అంటూ!