Dark Spots: ముఖంపై నల్ల మచ్చలు అనేవి చాలా మందికి ఆందోళన కలిగించే సమస్య. చర్మం మీద ఉన్న ఈ మచ్చలు అందాన్ని తగ్గించడమే కాక, ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తాయి. ఇలా ముఖంపై మచ్చలు రావడంతో చలా మంది దానికి కనిపించకుండా ఉండేందుకు రకాల రకాల క్రీములు రస్తుంటారు. అయితే.. మచ్చలు ఏర్పడడానికి చాలా కారణాలు ఉండవచ్చు. సూర్యకిరణాలు, హార్మోన్ల స్థాయిలు సరిగా ఉండకపోవడం, తక్కువ నిద్ర, అధిక ఒత్తిడి, మరియు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సమతుల్యంగా అందించక పోవడం.
నల్ల మచ్చలు గమనించకపోతే, ముఖం ప్రకాశాన్ని తగ్గించి, ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, సరైన సమయంలో దానిని గుర్తిస్తే.. చిటికెలో కొన్ని సహజ పదార్థాల సహాయంతో, ఈ మచ్చలను తగ్గించుకోవచ్చు. ఈ పరిష్కారాలు సహజమైనవి, రసాయనాలను ఉపయోగించకపోవడం వల్ల చర్మానికి నష్టం కూడా ఉండదు. అందుకే మా పెద్దలు సహజమైన పరిష్కారాలను వెతికి తంగేడు పువ్వు వంటి సహజసిద్ధమైన ఔషధాలను వాడేవారు.
తంగేడుతో ముఖం కాంతివంతం..
తంగేడు చెట్టు వేసవికాలంలో పసుపు రంగు పువ్వులతో అలరారుతుంది. ఈ పువ్వులు చర్మాన్ని సున్నితంగా మార్చి మచ్చలను మెల్లగా తగ్గించడంలో సహాయపడతాయని పూర్వీకులు నమ్మారు. తంగేడు చెట్టు వేసవికాలంలో పసుపు రంగు పువ్వులతో ప్రకాశిస్తుంది. ఈ పువ్వులు చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నల్ల మచ్చలను మెల్లగా తొలగించడంలో సహాయపడతాయని పూర్వీకులు నమ్మేవారు. ఈ పువ్వులను నీడలో ఆరబెట్టి పొడిచేసుకుంటే చర్మానికి ఉపయోగపడతాయి.
పొడిని సెనగపిండితో కలిపి పెరుగు, తేనె, గులాబి నీరు జోడించి పేస్ట్‌లా చేసుకుని ముఖంపై పలుచగా రాయాలి, దీంతో చర్మం మృదువుగా మారుతుంది. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మచ్చలు క్రమంగా తగ్గుతూ వస్తాయి. అలాగే ఆరబెట్టిన తంగేడు పువ్వులను నీటిలో మరిగించి వడకట్టి ఆ నీటిని సాయంత్రం ముఖంపై తడవడం కూడా ఉపయోగకరమవుతుంది. ఇది చల్లారిన తర్వాత మాత్రమే వాడాలి. రెండు రోజుల్లోపల వినియోగించాలి, ఆ తరువాతి రోజు ఉపయోగించకూడదు. ఆ నీటిని పారవేయడం మంచిది.
Also Read: Indian Railways: రైలు టికెట్ రద్దు ఛార్జీలు.. ఎవరికీ తెలియని అసలు నిజాలు ఇవే..!
ఇలా చేయండి తరువాత వాడండి..
ఏ విధానాన్ని ప్రయత్నించినా ముందుగా చిన్న పరీక్ష చేయడం తప్పనిసరి. చెవి వెనక భాగంలో లేదా మోచేతి లోపలి భాగంలో చిన్న ముద్ద రాసి ఒక రోజు గమనించి ఎర్రదనం, మంట, దురద లేకపోతేనే ముఖంపై వాడాలి. చర్మం చాలా డ్రైగా ఉన్నవారు సెనగపిండి తక్కువగా వేసి తేనె ఎక్కువగా జోడిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. గాయాలపై లేదా పుండ్లపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రెమిడీని అస్సలు పూయకూడదు. గర్భిణీలు కొత్త చిట్కా మొదలుపెట్టే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.
ఇలాంటి ఇంటి చిట్కాలు నెమ్మదిగా పనిచేస్తాయి. క్రమంగా నాలుగు నుండి ఆరు వారాల వరకు ఉపయోగిస్తేనే మార్పు కనిపిస్తుంది. పాత మచ్చలు అయితే మరింత సమయం పట్టవచ్చు. అంతేకాదు బయటకు వెళ్ళేప్పుడు సూర్యకాంతి నుంచి రక్షణ తప్పనిసరి. లేకపోతే చేసిన శ్రమ వృథా అవుతుంది. తంగేడు పువ్వు సహజమైనది, సులభంగా దొరికేది. దాన్ని సరిగ్గా వాడితే మంగు మచ్చలు తగ్గించడంలో తోడ్పడుతుంది.సరైన జాగ్రత్తలతో పాటు జీవన శైలిలో మార్పులు చేస్తే చర్మం క్రమంగా మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.