E-Paper
Advertisement

Arundhati: పెళ్లికి సిద్ధమైన అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. బ్యాచిలర్ పార్టీలో రచ్చ రచ్చ!

Arundhati: పెళ్లికి సిద్ధమైన అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. బ్యాచిలర్ పార్టీలో రచ్చ రచ్చ!

Arundhati child Artist: అనుష్క ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాలలో అరుంధతి (Arundhati)సినిమా ఒకటి. అనుష్క(Anushka) సినీ కెరియర్ లోనే ఈ సినిమా మైలురాయి లాంటిదని చెప్పాలి. ఇక ఈ సినిమాలో జేజమ్మగా అనుష్క తన నటనతో అదరగొట్టింది. ఇక అరుంధతి చిన్నప్పటి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నగేష్ (Divya Nagesh)ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అరుంధతి సినిమాలో చిన్నప్పటి జేజమ్మ పాత్రలో తన నటనతో దివ్య నాగేష్ అందరిని ఆకట్టుకున్నారని చెప్పాలి. ఈ సినిమా తనకెంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిన తదుపరి సినిమాలలో దివ్య నగేష్ పెద్దగా కనిపించలేదని చెప్పాలి.

జేజమ్మ పెళ్లి తేది ఫిక్స్…

ఇక ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న దివ్య నగేష్ ఇటీవల సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ ఏడాది మొదట్లో ఈమె నిశ్చితార్థం(Engagment) చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయిందని, ప్రస్తుతం పెళ్లి పనులలో దివ్య నగేష్ ఎంతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. దివ్య నగేష్ ప్రముఖ కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్(Ajay Kumar) ప్రేమలో ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది మొదట్లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక తాజాగా పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్…

ఈ జంట ఆగస్టు 18వ తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇలా పెళ్లి తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో దివ్య నాగేష్ పెద్ద ఎత్తున బ్యాచిలర్ పార్టీ (Bachelor Party)జరుపుకొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లికి సమయం దగ్గరగా పడుతున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అంటూ ఇప్పటికే పెళ్లి పనులను కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె బ్యాచిలర్ పార్టీకి, ప్రీ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా దివ్య నగేష్ సోషల్ మీడియా వేదికగా తన బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో మరికొంత మంది ఫన్నీగా ఈ ఫోటోలపై స్పందిస్తూ అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఆఖరికి పెళ్లి చేసుకుంటుంది కానీ అనుష్క మాత్రం ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన దివ్య నాగేష్ పలు సినిమాలలో దేవత పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఉన్నత చదువుల నిమిత్తం స్టడీస్ పై దృష్టి పెట్టిన నేపథ్యంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే తన సహనటుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతుంది.

Also Read: Ajith -Shalini: నా హృదయాన్ని కరిగించావ్.. అజిత్ కాళ్ళు మొక్కిన షాలిని..

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×