Athadu Re-release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలలో అతడు(Athadu) సినిమా ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో మహేష్ బాబు త్రిష జంటగా నటించిన ఈ సినిమా. అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా 2005వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఆగస్టు 9వ తేదీ ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది.
మహేష్ పుట్టినరోజు ప్రత్యేకం…
ఇలా ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతడు సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమాకు నిర్మాతగా సీనియర్ నటుడు మురళీమోహన్(Murali Mohan) వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీడియా వారు అడిగే ప్రశ్నలకు కూడా ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఇక ఈ సినిమా రీరిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమాకు వచ్చే కలెక్షన్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్…
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ అతడు సినిమా విడుదల చేసిన తర్వాత ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ మొత్తం మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ (Mahesh Babu charitable trust) కు అందజేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇలా కలెక్షన్స్ మొత్తం చారిటీ కోసం ఉపయోగిస్తామని చెప్పడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదివరకు మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు వంటి సినిమాలను కూడా మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ కోసమే ఉపయోగించారు. తాజాగా అతడు కలెక్షన్స్ కూడా చారిటబుల్ ట్రస్ట్ కు ఇవ్వడంతో ఎంతోమంది పేద పిల్లల గుండె ఆపరేషన్లకు చదువులకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలియజేశారు.
ఉచితంగా గుండె ఆపరేషన్లు…
ఇలా మహేష్ బాబు పేరిట చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాలన్నది నమ్రత మహేష్ బాబు గారి ఆలోచననీ చిత్ర బృందం వెల్లడించారు. గౌతమ్ నెలలు నిండక ముందే పుట్టిన నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నాకు డబ్బు ఉంది సరిపోయింది ఇతరుల పరిస్థితి ఏంటి అనే ఆలోచన తనకు రావడంతోనే ఈ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించానని గతంలో కూడా మహేష్ బాబు ఎన్నో సందర్భాలలో తెలియచేశారు. ఇక మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించడమే కాకుండా వారికి పునర్జన్మను ప్రసాదించిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: Court film: కోలీవుడ్ వెళ్లిన కోర్ట్… హీరోగా నిర్మాత కొడుకు..హీరోయిన్ కూడా?