BigTV English

War 2: సినిమా ప్రసారంలో అంతరాయం.. 20 నిమిషాల పాటు నిలిచిపోయిన ప్రదర్శన!

War 2: సినిమా ప్రసారంలో అంతరాయం.. 20 నిమిషాల పాటు నిలిచిపోయిన ప్రదర్శన!

War 2: ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR).. తొలిసారి బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేస్తూ చేసిన చిత్రం వార్ 2 (War 2) . బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా, కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈరోజు ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా (Adithya chopra) ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైంది.


ఆ థియేటర్లో సినిమాకి 20 నిమిషాల పాటు అంతరాయం..

ఇదిలా ఉండగా ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా కోసం అభిమానులు థియేటర్లకు బారులు తీరారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సడన్గా సినిమాకు ఒక థియేటర్లో అంతరాయం ఏర్పడి, దాదాపు 20 నిమిషాల పాటు సినిమా ఆగిపోయిందని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరులోని రంగమహల్ థియేటర్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ ప్రదర్శనకు అంతరాయం ఏర్పడింది. సినిమా ప్రసారమవుతుండగా మధ్యలో సౌండ్ కట్టడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు కూడా దిగారు. అలా దాదాపు 20 నిమిషాల పాటు సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


వార్ 2 సినిమా స్టోరీ..

వార్ 2 సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కబీర్ (హృతిక్ రోషన్) రా కి దూరమై ఎవరికి కనిపించకుండా చీకటిలోకి వెళ్లిపోయి.. టెర్రరిస్ట్ గ్రూపుతోనే సంబంధాలు మెయింటెన్ చేస్తూ ఉంటాడు. అతని లక్ష్యం వివిధ దేశాలకు చెందిన టెర్రరిస్ట్ గ్రూపులను సిండికేట్ గా ఫామ్ చేసుకొని ఆడిస్తున్న కలిని అంతం చేయడమే.. ఈ ప్రాసెస్ లో కబీర్ తన గురువు సునీల్ లూత్రాన్ని కూడా చంపాల్సి వస్తుంది. దీంతో రా మొత్తం కబీర్ ను అంతం చేయాలని చూస్తూ ఉంటుంది. ఇలా ఒక దేశద్రోహి అనే ముద్ర మోస్తాడు కబీర్. ఈ క్రమంలోనే ఇతడిని పట్టుకోవడానికి రా సంస్థ మేజర్ విక్రమ్ (ఎన్టీఆర్), సునీల్ లూత్రా కూతురు, కబీర్ లవర్ అయిన కావ్య (కియారా అద్వానీ) ను నియమిస్తుంది. ఒకానొక అండర్ కవర్ ఆపరేషన్ లో ఒక రాజకీయ నాయకుడి ఫ్యామిలీని కలీ సంస్థ చంపాలని చూస్తుంది. ఆ బాధ్యతను కబీర్ కి అప్పగిస్తుంది. అయితే ఆ ఘోరాన్ని ఆపడానికి విక్రమ్ సహాయం కోరతాడు కబీర్.. రక్షణ కల్పించాల్సిన విక్రం ఆ రాజకీయ నాయకుడి కుటుంబాన్ని అంతం చేసి కబీర్ ని ఇరికిస్తాడు. ఆ తర్వాత కబీర్ ని ఎందుకు టార్గెట్ చేశాడు? అసలు విక్రమ్ ఎవరు? కబీర్ వల్ల విక్రమ్ కి జరిగిన అన్యాయం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

ALSO READ:Darshan Bail: హీరో దర్శన్ కు సుప్రీం కోర్ట్ లో చుక్కెదురు.. జైల్లోనే మగ్గాల్సిందేనా?

Related News

Coolie – War2: నిర్మాతలే సినిమాను చంపుకుంటే.. కూలీ, వార్ 2 పరిస్థితి ఇదే మరి

War 2 Movie : లోకేష్ కనగరాజ్‌ను కాపీ కొట్టిన వార్ 2… అడ్డంగా దొరికిపోయారు

Darshan Bail: హీరో దర్శన్ కు సుప్రీం కోర్ట్ లో చుక్కెదురు.. జైల్లోనే మగ్గాల్సిందేనా?

Bipasha Basu: మృణాల్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన బిపాసా బసు.. ఆ ఆలోచనల నుండి బయటకు రండి అంటూ!

Coolie Collections : రజినీ ఖాతాలో హిట్.. డే 1 వసూళ్ల ప్రిడిక్షన్..కలెక్షన్ల సునామీనే..

Big Stories

×