Hero Darshan: కన్నడ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శన్ తూగుదీప (Darshan Thugudeepa) గత కొన్ని రోజులుగా అభిమాని రేణుక స్వామి (Renuka Swamy) హత్య కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కర్ణాటక హైకోర్టు తీర్పుతో బెయిల్ అందుకున్న ఈయనపై బెంగళూరు పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు హీరో దర్శన్ కి సుప్రీంకోర్టులో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను.. నేడు సుప్రీంకోర్టు కొట్టి వేస్తూ దర్శన్ కి లభించిన బెయిల్ ను రద్దు చేసింది. అంతేకాదు న్యాయస్థానం ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దర్శన్ ఇక జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
కర్ణాటక హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు..
అసలు విషయంలోకి వెళ్తే.. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆయన అనారోగ్య సమస్యలతో బెయిల్ అందుకున్నారు. అనంతరం డిసెంబర్ 13వ తేదీన కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అటు ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి పవిత్ర గౌడ (పవిత్ర Gowda) మరో 15 మంది నిందితులకు కూడా షరతులతో కూడిన బెయిల్ అప్పట్లో లభించిన విషయం తెలిసిందే. అయితే దీనిని సవాల్ చేస్తూ బెంగళూరు పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారణను స్వీకరించగా.. న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా సారధ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదోపవాదనలను ఆలకించిన తర్వాత తుది తీర్పు వెల్లడించింది. అందులో భాగంగానే దర్శన్ బెయిల్ ను కొట్టివేసింది.
అభిమానిని దారుణంగా హతమార్చిన దర్శన్.. ఆయన బృందం..
అసలు విషయంలోకి వెళ్తే.. కన్నడ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న దర్శన్ కు వివాహమయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా ఈయన ప్రముఖ నటి పవిత్ర గౌడతో సంబంధం పెట్టుకోవడాన్ని ఆయన అభిమాని చిత్రదుర్గాకు చెందిన రేణుక స్వామి జీర్ణించుకోలేకపోయారు. దీంతో పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అశ్లీలకరమైన పోస్ట్లు, కామెంట్లు చేశాడు. దీంతో మండిపోయిన పవిత్ర గౌడ కక్ష పెంచుకొని సుఫారీ ఇచ్చి మరీ దర్శన్ తోపాటు మరో 15 మందితో కలిసి అత్యంత దారుణంగా హతమార్చారు అని ఆరోపణలు వచ్చాయి. ఇక గత ఏడాది జూన్ 11వ తేదీన వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఆరోపణలకు తగినట్టు సాక్షాలు కూడా లభించడంతో నేరం నిరూపితమైంది. దాంతో దర్శన్, పవిత్ర గౌడతోపాటు మరో 15 మంది పేర్లపై పోలీసులు చార్జీ షీట్ నమోదు చేశారు. ఇందులో A1 గా పవిత్ర ,A2గా దర్శన్ పేర్లు నమోదవడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ కేసులోని దర్శన్ కి బెయిల్ నిరాకరించబడింది.
ALSO READ:Bipasha Basu: మృణాల్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన బిపాసా బసు.. ఆ ఆలోచనల నుండి బయటకు రండి అంటూ!