BigTV English

SSMB29 First Look: మహేష్‌, రాజమౌళి మూవీ ఫస్ట్‌లుక్‌ కోసం అవతార్ డైరెక్టర్.. జక్కన స్కేచ్‌ మామూలుగా లేదుగా..

SSMB29 First Look: మహేష్‌, రాజమౌళి మూవీ ఫస్ట్‌లుక్‌ కోసం అవతార్ డైరెక్టర్.. జక్కన స్కేచ్‌ మామూలుగా లేదుగా..

SSMB29 First Look: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మహేష్‌ బాబు 29వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతోన్న మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమా కోసం ఇండియన్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు విదేశీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో జక్కన్న అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆర్‌ఆర్ఆర్‌ మూవీతో టాలీవుడ్‌కు ఆస్కార్‌ అందించారు. హాలీవుడ్‌ దిగ్గజాలు సైతం ఈ చిత్రాన్ని కొనియాడాయి.


SSMB29 విషయంలో ఆ రూల్ బ్రేక్

దీంతో జక్కన్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఇండియన్‌ మూవీ లవర్స్‌ మాత్రమే కాదు హాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి మహేష్‌ బాబుతో పాన్‌ వరల్డ్‌ మూవీ రూపొందిస్తున్నారు. నిజానికి రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నారట మూవీ టీం సందడి మామూలుగా ఉండదు. ప్రకటనతోనే ప్రెస్‌మీట్స్‌ పెట్టిన మూవీ విశేషాలు పంచుకుంటారు. అయితే SSMB29 విషయంలో జక్కన్న తన రూల్స్‌ని పక్కన పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్‌ షూటింగ్‌ ప్రారంభించారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆఫ్రీకాలో నెక్ట్స్‌ షెడ్యూల్‌ జరుపుకోనుందట.


ముందు నుంచి SSMB29 విషయంలో జక్కన్న మొదటి చాలా గొప్యత పాటిస్తున్నారు. పూజ కార్యక్రమం నుంచి సినిమాని సెట్స్ కి తీసుకువెళ్లడం వరకు ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచారు. కనీసం మహేష్‌ బర్త్‌డే కి అయిన ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తారని అభిమానులంత ఆశపడ్డారు. కానీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్ చేసి.. త్వరలోనే SSMB29కి నుంచి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇస్తుందని చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను ప్రకటించనున్నారట. ఇందుకోసం జక్కన్న భారీ ప్లాన్‌ చేశారు. ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ కోసం ఏకంగా హాలీవుడ్‌ లెజెండ్‌ని రంగంలోకి దింపుతున్నారు.

ఫస్ట్ లుక్ కోసం అవతార్ డైరెక్టర్

అవతార్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ చేతుల మీదుగా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేయబోతున్నారట. త్వరలోనే అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌ కోసం జేమ్స్‌ కామెరూన్‌ ఇడియా రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా SSMB29 మూవీ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనున్నారట. ‘అవతార్’ ఫ్రాంఛైజీలో నుంచి ‘అవతార్: ది ఫైర్ అండ్ యాష్’ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నవంబర్‌లో ఇండియాలో జరిగే మూవీ ప్రమోషన్స్‌కి జేమ్స్‌ కామెరూన్‌ రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ రిలీజ్ చేయించేందుకు జక్కన్న ప్లాన్‌ చేశారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం SSMB29 అప్‌డేట్‌ కోసం మరో మూడు నెలలు ఆగాల్సిందే.

Related News

Hero Dharma Mahesh Wife : గర్భవతిగా ఉన్నప్పుడే నన్ను చంపాలని చూశాడు.. హీరోపై భార్య సంచలన కామెంట్స్..

Ram Gopal Varma : కుక్క కాటు.. ప్రేమ కాటు అనుకుంటారు..సుప్రీం కోర్టు తీర్పు పై వర్మ సంచలన ట్వీట్..

Mana Shankara Vara Prasad Garu : మన శంకర వరప్రసాద్ ఒక్కరు కాదు ఇద్దరు… మూవీ ఫుల్ స్టోరీ ఇదే ?

Anil Ravipudi: ‘మన శంకర వరప్రసాద్‌’.. వెంకీమామ గ్రాండ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. అసలు విషయం చెప్పేసిన అనిల్‌

Comedian Ramachandra: పక్షవాత బారినపడ్డ వెంకీ కమెడియన్.. రవితేజను హెల్ప్ అడిగితే?

Big Stories

×