E-Paper
Advertisement

అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది.. ఒక్క సినిమాకి అన్ని కోట్లా?

అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది.. ఒక్క సినిమాకి అన్ని కోట్లా?
Advertisement

Anil Ravipudi Remuneration:హిట్ మిషిన్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .ముఖ్యంగా ఈ ఏడు పొంగల్ కి రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరోసారి తన సత్తాని ఘనంగా చాటాడు ఈ యంగ్ డైరెక్టర్ .అయితే ఇలా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ యంగ్ డైరెక్టర్ అసలు ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం పుచ్చుకుంటాడా అంటూ ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్ .

ఏకంగా 20 నుంచి 25 కోట్ల మధ్యలో

Advertisement

ఇక అనిల్ రావిపూడి గత సినిమాల వరకు దాదాపుగా 10 నుండి 15 కోట్ల మధ్యలో తీసుకుంటున్నాడు అన్న టాక్ ఉంది. అయితే తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో అనిల్ రావిపూడి ఒకసారిగా పారితోషికం పెంచేశాడని , ప్రస్తుతం చేస్తున్న సినిమాకి ఏకంగా 20 నుంచి 25 కోట్ల మధ్యలో తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.అయితే ఇది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు గానే పరిగణించాలి.

డీల్ చేయడం అంటే అంత ఆషామాషీ కాదు

Advertisement

నిజానికి తక్కువ బడ్జెట్లో వందల కోట్లు వసూలు చేస్తున్న అనిల్ రావిపూడి ఈ మాత్రం పుచ్చుకోవడంలో న్యాయం ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది. చిన్న బడ్జెట్ లో తక్కువ రోజుల్లో,పెద్ద పెద్ద హీరోలని డీల్ చేయడం అంటే అంత ఆషామాషీ కాదు .అలాంటి పనిని అనిల్ రావిపూడి ఎంచక్కా ఆరు నెలల్లో పూర్తి చేయడం అంటే ప్రొడ్యూసర్ నెత్తిన పాలు పోయడమే.

ఇండస్ట్రీకి అవసరం కూడా

ముఖ్యంగా హిట్టు సినిమాలే కరువు అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి సూపర్ ఫాస్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీకి అవసరం కూడా. ఇక అనిల్ రావిపూడి సినిమాల విషయానికి వస్తే 2017లో పటాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర డైరెక్టర్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన సుప్రీమ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టింది .ఇక రవితేజతో వచ్చిన రాజా ది గ్రేట్,మహేష్ సరిలేరు నీకెవ్వరు f2,f3 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో అనిల్ రావిపూడి రేంజ్ ఒకసారిగా పెరిగింది .

నాగ్ తో ఎప్పుడు జోడి కడతారో

ముఖ్యంగా బాలయ్య బాబుతో వచ్చిన భగవంత్ కేసరి సినిమా అనిల్ రావిపూడి లోని మరో కోణాన్ని చూపెట్టిందని చెప్పాలి .ఇక సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీ మామతో మరోసారి జోడి కట్టి 300 కోట్ల వసూల్లని కొల్లగొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ మన శంకర వరప్రసాద్ గారు అంటూ చిరుతో కూడా సూపర్ హిట్ కొట్టడం విశేషం.అలా ఇప్పటికే ముగ్గురు టాప్ హీరోలని దర్శకత్వం వహించిన ఈ హిట్ మిషిన్ మరి కింగ్ అక్కినేని నాగ్ తో ఎప్పుడు జోడి కడతారో చూడాలి!

also read :నోటికొచ్చినట్టు మాట్లాడితే అంతే.. రాధిక స్ట్రాంగ్ వార్నింగ్

Tags

Related News

జైలర్ 2లో నోరా vs తమన్నా.. అసలు ఈ గ్లామర్ రచ్చ ఎందుకు?

RX 100 బ్యూటీకి ఏమైంది? ఇప్పుడు ఎక్కడుందంటే..

నోటికొచ్చినట్టు మాట్లాడితే అంతే.. రాధిక స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభాస్ మూవీకి టికెట్ ఇవ్వలేదని థియేటర్ కొన్న అభిమాని.. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత?

జనమంటే సప్తగిరి థియేటర్ యజమానికి ఎందుకంత భయం? మరి ఏ సినిమాలు వేస్తారు?

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ పై మహేష్ బాబు రివ్యూ… ఫహద్ సర్ మీరు అద్భుతం అంటూ!

జిమ్‌లో మంచు విష్ణు కష్టాలు చూస్తే.. ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది!

Big Stories

Advertisement
×