E-Paper
Advertisement

జైలర్ 2లో నోరా vs తమన్నా.. అసలు ఈ గ్లామర్ రచ్చ ఎందుకు?

జైలర్ 2లో నోరా vs తమన్నా.. అసలు ఈ గ్లామర్ రచ్చ ఎందుకు?
Advertisement

Jailer 2 Bindass Song:కావాలయ్య నువ్వు రావాలి.. అంటూ జైలర్ సినిమాలో తమ్ము బేబీ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఒకరకంగా జైలర్ సినిమాకి సాలిడ్ వసూలు రావడానికి ఈ పాట కూడా ఒక మెయిన్ రీజన్ అనే చెప్పాలి. ఇక తాజాగా జైలర్ సీక్వెల్ గా జైలర్ 2 వస్తుండటంతో ఇందులో దానికి మించిన పాట ఏమొస్తుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేశారు మూవీ లవర్స్ .

అయితే తాజాగా ఇదిగో అంతకుమించి సాంగ్ అంటూ ఒక పాటను అదిరింది మూవీ టీమ్. బిందాస్ అంటూ వచ్చిన ఈ పాటలో నోరా ఫతేహి గ్లామర్ ని కూడా బాగానే వలకపోసింది. అయితే ఈ గ్లామర్ తమ్మూ బేబీని మించి లేదన్నది నెటిజన్ల వాదన.

Advertisement

ఎవరెలా డాన్స్ చేస్తున్నారు

దీంతో ఇప్పుడు సినిమా నుండి పాట వస్తే మ్యూజిక్ కన్నా విజువల్స్ లో గ్లామర్ ఎంతుంది ఎవరెలా డాన్స్ చేస్తున్నారు అనే డిస్కషన్ ఎక్కువగా జరుగుతున్నట్టు అర్థం అవుతుంది. ఇక తమ్ము బేబీని పోలుస్తుంటే ఇంకాస్త గ్లామర్ ఎక్కువ చూపిస్తే సినిమా హిట్ అవుతుందా పాట చార్ట్ బస్టర్ అవుతుందా అన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి .

Advertisement

సినిమా అంటే నిజంగానే హద్దులు దాటాల్సిందేనా, ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి గ్లామర్ ఒక్కటే మార్గమా, హీరోయిన్స్ ఎంత ఎక్కువ గ్లామర్ చూపిస్తే సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

సినిమా హిట్ అయితే

నిజానికి ఒకప్పుడు సినిమా హిట్ అయితే ట్యూన్ ఆటోమేటిక్ గా గుర్తు చేసుకునే వాళ్ళు .స్టెప్స్ సూపర్ హిట్ అయితే వాటిని ఫాలో అయ్యే వాళ్ళు. కానీ ఇప్పుడు పాట రిలీజ్ కాగానే డ్రెస్ ఏంటి, గ్లామర్ ఎంత ఉంది, స్టెప్పులు ఎంత బోల్డ్ గా ఉన్నాయి అంటూ డిస్కషన్స్ మొదలవుతున్నాయి.

నిజానికి ఈ సినిమాలలో గ్లామర్ ఉండటం తప్పు కాదు, సినిమా అంటే కనబడే ఒక విజువల్ మీడియం కాబట్టి స్టైల్ ,గ్లామర్ అన్ని అవసరమే కానీ అదే సినిమాకు మెయిన్ రీజన్ అన్నట్టుగా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి. ఇక తాజాగా బిందాస్ విషయంలో కూడా ఇదే డిస్కషన్ నడుస్తుంది.

ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది

కావాలయ్య అనే పాటతో పోల్చడమే ఇప్పుడు సమస్య .ఏది ఏమైనా ప్రస్తుతం ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది .సినిమా కొత్తగా ఉంటే చూస్తాడు లేదంటే సైలెంట్ గా సైడ్ అయిపోతాడు .అంతేకానీ గ్లామర్ ఎంతుంది, ఎవరు ఎక్కువ షో చేశారు అనేది ఆడియన్స్ అస్సలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేకర్స్ ఇదే పాయింట్ ఫై ఫోకస్ పెడితే మంచిది!

Tags

Related News

RX 100 బ్యూటీకి ఏమైంది? ఇప్పుడు ఎక్కడుందంటే..

అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది.. ఒక్క సినిమాకి అన్ని కోట్లా?

నోటికొచ్చినట్టు మాట్లాడితే అంతే.. రాధిక స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభాస్ మూవీకి టికెట్ ఇవ్వలేదని థియేటర్ కొన్న అభిమాని.. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత?

జనమంటే సప్తగిరి థియేటర్ యజమానికి ఎందుకంత భయం? మరి ఏ సినిమాలు వేస్తారు?

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ పై మహేష్ బాబు రివ్యూ… ఫహద్ సర్ మీరు అద్భుతం అంటూ!

జిమ్‌లో మంచు విష్ణు కష్టాలు చూస్తే.. ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది!

Big Stories

Advertisement
×