Payal Rajput:పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు చెప్పగానే మన అందరికీ గుర్తొచ్చే సినిమా ఆర్ఎక్స్ 100 .2018లో అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇందులో పాయల్ రాజ్ పుత్ పోషించిన ఇందూ పాత్ర అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒకసారి సైలెంట్ అవడంతో అసలు ఈ భామ ఇప్పుడు ఏం చేస్తుందో అంటూ ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్ .అయితే ఆర్ఎక్స్ 100 తర్వాత RDX100 , వెంకీ మామ, డిస్కో రాజా ,అనగనగా ఓ అతిథి తీస్మార్ ఖాన్, జిన్నా అంటూ వరుస సినిమాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎందుకనో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది
అయితే అచ్చొచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే మరోసారి మంగళవారం అంటూ వాళ్ళ థ్రిల్లర్ సినిమాతో సాలిడ్ సౌండ్ చేసిన ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయింది. ఇక రక్షణ అంటూ ఒక చిన్న సినిమా చేసిన అది అంతంతమాత్రంగానే ఆడింది .దీంతో అసలు పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ఎక్కడ ఉందనే ప్రశ్న అభిమానుల్లో రైజ్ అవుతుంది.
అయితే లీడర్ అనే తమిళ సినిమాలో, అలాగే పంజాబీ సినిమాలైన కుష్ కబరీ, ద గ్రేట్ పంజాబీ రాబరీ వంటి సినిమాలు చేసింది ముద్దుగమ్మ. ఇక తాజాగా కిరాతక అనే తెలుగు సినిమాలో కూడా ఈ భామ నటిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే తమిళంలో గోల్మాల్ అనే సినిమాలో కూడా బాలరాజు నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అంటే సినిమాలు తగ్గించినప్పటికీ చేతిలో మాత్రం పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పాలి.
అయితే సినిమాలు తగ్గినప్పటికీ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పోస్టులతో అభిమానుల దృష్టిని ఆకర్షించే పనిలోనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ ఫోటోలే మరోసారి నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి మరి . బ్లాక్ కలర్ శారీలో పాయల్ ఇచ్చిన ఈ స్టన్నింగ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. సాధారణంగా ట్రెండీ, మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లో కనిపించే పాయల్.. ఈసారి మాత్రం చీరకట్టులో కనిపించి తన స్టైల్‌లో మరో కోణాన్ని చూపించిందనే చెప్పాలి.
బ్లాక్ శారీకి తగ్గట్టుగా బ్లాక్ బ్లౌజ్, సింపుల్ జ్యువెలరీతో పాయల్ చేసిన ఈ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్, మేకప్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఫోటోకు మరింత గ్లామర్‌ను తీసుకొచ్చాయనడం లో సందేహం లేదు. ఫోటో బ్యాక్‌డ్రాప్ కూడా పూర్తిగా బ్లాక్ థీమ్‌లో ఉండటంతో పాయల్ లుక్ మరింత హైలైట్ అవుతోంది. దీంతో పాయల్ కొత్త ఫోటోషూట్ అడిరిపోయింది అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, బ్లాక్‌లో మరింత అందంగా కనిపిస్తున్నావంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు మరికొందరు .
also read :అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది.. ఒక్క సినిమాకి అన్ని కోట్లా?
ఏదేమైనా ఒకప్పుడు ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ని షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సైలెంట్ అవ్వడంతో డిసప్పాయింట్ అవుతున్నారు మూవీ లవర్స్ .చూడాలి మరి ఇందూ పాత్రతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ వచ్చే రోజుల్లో ఈ సినిమాలతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో!