E-Paper
Advertisement

మోహన్‌లాల్ తో నటించడంపై భాగ్యశ్రీ ఎమోషనల్ పోస్ట్!

మోహన్‌లాల్ తో నటించడంపై భాగ్యశ్రీ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Bhagya shri Borse:అందం, అభినయంతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచిన ‘లెనిన్’ సినిమాలో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) సరసన నటించి ఆకట్టుకుంది. ఇందులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు ప్రముఖ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) తో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో నటించి మరింత క్రేజ్ దక్కించుకున్న ఈమె.. లెనిన్ సినిమాతో మరో మెట్టు ఎక్కింది. ఇక అలాంటి భాగ్య శ్రీకి ఏకంగా మాలీవుడ్లో అవకాశం లభించింది. అందులోనూ మలయాళం సీనియర్ స్టార్ హీరో మోహన్‌లాల్ తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి.

మీతో నటించడం గొప్పవరం – భాగ్యశ్రీ..

ఇకపోతే మాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతోంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించగా.. ఇప్పుడు ఈ విషయాన్ని ఈమె అధికారికంగా ఏ పాత్రలో నటించబోతోంది అనే విషయంపై స్పష్టం చేసింది. మోహన్ లాల్ హీరోగా తె తెరకెక్కుతున్న ‘ఆపరేషన్ గంగా’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే మోహన్ లాల్ పక్కన హీరోయిన్గా నటించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మోహన్‌లాల్ తో కలిసి దిగిన ఒక ఫోటోని పంచుకుంటూ..” ప్రియమైన మోహన్‌లాల్ సార్.. మీతో కలిసి నటించడం ఒక వరంలా అనిపిస్తుంది. ప్రతిరోజు షూటింగ్లో, నేను సినిమాను మీ కళ్ళతో చూస్తూ, మీ నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. మీరు నిజంగా గొప్ప ప్రతిభావంతులు సార్” అంటూ నమస్కరిస్తున్న ఎమోజీ షేర్ చేసింది భాగ్యశ్రీ బోర్సే.

Advertisement

మొత్తానికైతే మోహన్‌లాల్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వగా ఇప్పుడు మోహన్‌లాల్ కో స్టార్ గా నటిస్తున్నట్లు చెబుతూనే ఆయనతో కలిసి నటించడం పై తన అభిప్రాయాన్ని పంచుకుంది భాగ్యశ్రీ.

also read:‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్.. ఆ అనుమానాలు మీకొద్దు- నిర్మాత నాగవంశీ!

యదార్ధ సంఘటనల ఆధారంగా ఆపరేషన్ గంగా..

Advertisement

‘ఆపరేషన్ గంగా’ చిత్రాన్ని దర్శకుడు విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును ఒక యధార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. నిజ జీవితంలో జరిగిన సంఘటనను ఇప్పుడు నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మోహన్‌లాల్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? దర్శకుడు విష్ణు మోహన్ కథను ఏ విధంగా తెరపై ఆవిష్కరించబోతున్నారు ? అన్నది ఆసక్తికరంగా మారింది..

భాగ్యశ్రీ కి ఈ సినిమా సక్సెస్ అందిస్తుందా?

ఇక ఈ చిత్రానికి ధురంధర్ వంటి భారీ చిత్రాలకు సంగీతం అందించిన సస్వత్ సింగ్ సచ్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. లెనిన్ తో భారీ సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే కి ఇప్పుడు ఏకంగా మోహన్‌లాల్ తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా ఆమె కెరియర్ లో ఇదో అతిపెద్ద మూవ్ అని చెప్పాలి. మరి ఈ సినిమాతో గనుక ఈమె సక్సెస్ అందుకుందంటే.. మాలివుడ్లో ఈమెకు మరిన్ని అవకాశాలు తలుపుతట్టే అవకాశం కనిపిస్తుంది. మరి భాగ్యశ్రీ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Related News

‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్.. ఆ అనుమానాలు మీకొద్దు- నిర్మాత నాగవంశీ!

జైలర్ 2లో నోరా vs తమన్నా.. అసలు ఈ గ్లామర్ రచ్చ ఎందుకు?

RX 100 బ్యూటీకి ఏమైంది? ఇప్పుడు ఎక్కడుందంటే..

అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది.. ఒక్క సినిమాకి అన్ని కోట్లా?

నోటికొచ్చినట్టు మాట్లాడితే అంతే.. రాధిక స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభాస్ మూవీకి టికెట్ ఇవ్వలేదని థియేటర్ కొన్న అభిమాని.. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత?

జనమంటే సప్తగిరి థియేటర్ యజమానికి ఎందుకంత భయం? మరి ఏ సినిమాలు వేస్తారు?

Big Stories

Advertisement
×