Amitabh Bachchan:సాధారణంగా నటీనటులు తెరపై ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడానికి తెర వెనుక ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి సన్నివేశాలు బాగా రావడానికి ప్రాణాలు కూడా పణంగా పెడతారు అనడంలో సందేహం లేదు. అలా ఎంతోమంది తమ పాత్రను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడానికి గాయాల పాలయ్యారు. ఆఖరికి సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక స్టార్ నటుడు 83 సంవత్సరాల వయసులో కూడా షూటింగ్లో గాయపడినా.. తగ్గేదేలే అంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)…
ఒకవైపు సినిమాలు.. మరొకవైపు షోలు అంటూ మరింత బిజీగా మారినా అమితాబ్ బచ్చన్.. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 18 కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ సీజన్ షూటింగ్లో ఆయన కాలు జారిపడ్డారు. ఆయన మోకాలికి స్వల్ప గాయమైనట్టు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ.. అభిమానులు ఆందోళన చెందవద్దు అంటూ భరోసా ఇచ్చారు. సాధారణంగా షో ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ స్టేజ్ మధ్యలో నిల్చొని కంటెస్టెంట్లకు స్వాగతం పలుకుతూ ఉంటారు.
అయితే ఈసారి తన మోకాలికి గాయం కావడంతో.. నిలబడడంలో ఇబ్బందిగా ఉండడంతో కూర్చొని ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన ఆడియన్స్ తో ప్రస్తావిస్తూ..” ఈ షో షూటింగ్ సమయంలో నేను కాలు జారిపడ్డాను. మోకాలికి గాయం కావడంతో నిలబడడంలో ఇబ్బందిగా ఉంది. అందుకే కంటెస్టెంట్లను ఆహ్వానించడానికి నేను సీటు వద్దే నిలబడతాను. కానీ వారి వద్దకు వెళ్లి నిలబడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది” అంటూ చెప్పారు. దీంతో అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలాగే మరింత హుషారుగా కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నాను. ఏది ఏమైనా 83 ఏళ్ల వయసులో కూడా విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
also read:ఏకంగా 50 కట్స్ తో టీవీలోకి ధురంధర్ 2.. ఎప్పుడు? ఏ ఛానల్ అంటే?
ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ,దీపికా పదుకొనే (Deepika Padukone) కీలకపాత్ర పోషిస్తూ కమలహాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్ లాంటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమాకి కొనసాగింపుగా కల్కి 2 లో కూడా ఆయన అశ్వద్ధామ పాత్రలోనే కనిపించనున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఏది ఏమైనా అమితాబ్ బచ్చన్ ఒకవైపు షోలు, మరొకవైపు సినిమాలు అంటూ ఈ వయసులో కూడా నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.