Anakapalli Movie -Naidu: సినిమా అంటే చాలామందికి ఒక ఫ్యాషన్ . కొంతమంది సినిమాలు చూసి ఎంజాయ్ చేయగా మరి కొంతమంది సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే సినిమా పై వ్యామోహంతో ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొని సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో అనకాపల్లి సినిమా (Anakapalli Movie)నిర్మాత నాయుడు(Naidu) ఒకరు. నేడు ఈయన పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మారుమోగిపోతుంది. ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ప్రభాస్(Prabhas) అభిమాని అనే ఒక్క ట్యాగ్ తో ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. తాజాగా ఈయన నిర్మాణంలో అనకాపల్లి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాయుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తనుకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదని తాను ఒక సాధారణ ప్రభాస్ అభిమానిని అని తెలిపారు. తాను ప్రభాస్ నటించిన మిర్చి సినిమా(Mirchi Movie) విడుదలైనప్పుడు అనకాపల్లిలో సినిమా చూడటానికి ఒక థియేటర్ వెళ్లాను అయితే అక్కడ నాకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఏ రోజుకైనా ఈ థియేటర్ ను నేనే కొనుక్కోవాలని భావించాను ఆ దిశగానే అడుగులు వేశానని ఆ థియేటర్ నా సొంతం చేసుకున్నానని తెలిపారు.
ఇలా థియేటర్ ఓనర్ గా మారి అనంతరం డిస్ట్రిబ్యూటర్ గా మరో అడుగు ముందుకు వేసి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారని ఇప్పుడు నిర్మాతగా మీ ముందుకు వస్తున్నానని నాయుడు తెలిపారు. ఏ థియేటర్లో అయితే నాకు టికెట్ ఇవ్వలేదో అదే థియేటర్లో ఈరోజు నా సినిమాని విడుదల చేయడం సంతోషంగా ఉంది అంటూ ఈయన తెలియజేశారు. ఇలా నాయుడు తన సినిమా జర్నీ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక సాధారణ అభిమానిగా టికెట్ కోసం క్యూ లైన్ లో నిలబడి అక్కడ జరిగిన ఒక చిన్న అవమానం కారణంగా ఎగ్జిబిటర్ గా మారడం థియేటర్ ఓనర్ గా ఎదగడం ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి వారి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. ఇక అనకాపల్లి సినిమా విషయానికి వస్తే ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలలో నటించిన అనకాపల్లి సినిమా అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా నిర్మాత నాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ పై మహేష్ బాబు రివ్యూ… ఫహద్ సర్ మీరు అద్భుతం అంటూ!