E-Paper
Advertisement

‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్.. ఆ అనుమానాలు మీకొద్దు- నిర్మాత నాగవంశీ!

‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్.. ఆ అనుమానాలు మీకొద్దు- నిర్మాత నాగవంశీ!
Advertisement

Aadarsha kutumbam AK 47:మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో… విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం- ఏకే 47’. నివేదా పేతురాజు, శ్రీనిధి శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మొదట అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల అక్టోబర్ 9కి సినిమాని వాయిదా వేశారు. గతంలో అక్టోబర్ రెండు నుండి సినిమా వాయిదా పడుతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించినా.. ఆ అనుమానాలు మీకు అక్కర్లేదు.. కచ్చితంగా అక్టోబర్ 2న సినిమా రిలీజ్ అవుతుంది అంటూ నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ 9కి సినిమా వాయిదా వేయడంతో కొంతమంది నాగ వంశీ పై విమర్శలు కూడా గుప్పించారు.

అక్టోబర్ 9న ఆదర్శ కుటుంబం రిలీజ్ పక్కా..

అయితే ఇప్పుడు అక్టోబర్ 9న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ సారైనా అనుకున్న తేదీకి సినిమా విడుదలవుతుందా? అని చాలామంది ఆశగా ఎదురుచూస్తుండగా .. నాగ వంశీ మరో పోస్టుతో కన్ఫామ్ చేసేశారు. ” మా రిలీజ్ పంక్చువాలిటీ మీద మీకు డౌట్ ఉండొచ్చు.. కానీ ఈసారి అలాంటి డౌట్ ఏం వద్దు.. ఆదర్శ కుటుంబం ఏకే 47 కచ్చితంగా అక్టోబర్ 9న రిలీజ్ అవుతుంది. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆదర్శ కుటుంబం ఏకే 47 ట్రైలర్ ను అక్టోబర్ 6వ తేదీన విడుదల చేయబోతున్నామని, ఏడవ తేదీన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని, నాగ వంశీ తెలిపారు.

Advertisement

also read:బిగ్ బాస్ సీజన్ 1 నుండి 10 వరకు.. హోస్టుల రెమ్యూనరేషన్లు తెలిస్తే షాక్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్..

మొత్తానికి అయితే ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూనే.. అక్టోబర్ 6న ట్రైలర్ లాంచ్ ఉంటుంది అని, ఏడవ తేదీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఆదర్శ కుటుంబం సినిమా విశేషాలు..

Advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నారా రోహిత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్యా, బ్రహ్మజీ , యువిన పార్థవి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచేసాయి. దీనికి తోడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ త్రివిక్రమ్ , హీరో వెంకటేష్, హీరోయిన్ శ్రీ నిధి శెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సగటు మధ్యతరగతి కుటుంబీకుడికి కనెక్ట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.

అక్టోబర్ రెండు నుండి వాయిదా పడిన ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తే ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ ను మిళితం చేస్తూ రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

మోహన్‌లాల్ తో నటించడంపై భాగ్యశ్రీ ఎమోషనల్ పోస్ట్!

జైలర్ 2లో నోరా vs తమన్నా.. అసలు ఈ గ్లామర్ రచ్చ ఎందుకు?

RX 100 బ్యూటీకి ఏమైంది? ఇప్పుడు ఎక్కడుందంటే..

అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది.. ఒక్క సినిమాకి అన్ని కోట్లా?

నోటికొచ్చినట్టు మాట్లాడితే అంతే.. రాధిక స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభాస్ మూవీకి టికెట్ ఇవ్వలేదని థియేటర్ కొన్న అభిమాని.. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత?

జనమంటే సప్తగిరి థియేటర్ యజమానికి ఎందుకంత భయం? మరి ఏ సినిమాలు వేస్తారు?

Big Stories

Advertisement
×