Radhika Sarathkumar:సినిమా ఇలా రిలీజ్ అయింది అంటే చాలు సోషల్ మీడియాలో రివ్యూలు ఈ రేంజ్ లో పేలుతాయో చెప్పక్కర్లేదు .ఇదిగో ఇదే విషయంపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతుంది అలనాటి వెటరన్ బ్యూటీ రాధిక.
రివ్యూలు హద్దుల్లో ఉండాలి
అవును తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈ కోలీవుడ్ సీనియర్ స్టార్ సోషల్ మీడియా యూట్యూబ్లో చెప్పే రివ్యూలు హద్దుల్లో ఉండాలంటూ మండిపడ్డారు. ముఖ్యంగా సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పు చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ దాన్ని ఆసరాగా చేసుకొని సినిమా వాళ్ళని ,వాళ్ళ ఫ్యామిలీ లని టార్గెట్ చేయడం, పర్సనల్ గా తిట్టడం సరైన పద్ధతి కాదంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు .
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కాలంటే కొన్ని వందల మంది కష్టపడతారని, కానీ వారందరి కష్టాన్ని మీ రివ్యూ లతో బూడిద పాలు చేస్తున్నారని ,ముఖ్యంగా రివ్యూల పేరిట కొన్ని నెలల కష్టాన్ని కొన్ని నిమిషాలలో తేల్చేస్తున్నారని, అలా సినిమాని తక్కువ చేసి మాట్లాడడం కాదన్నారు.
రివ్యూల పేరు మీద వివాదాలు కొత్త కాదు
అందులో పని చేసిన వాళ్ల కష్టాన్ని తగ్గించడం చాలా బాధ కలిగిస్తుంది అంటూ తన ఆవేదనని బయట పెట్టారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో రివ్యూల పేరు మీద వివాదాలు కొత్త కాదు .ఇలా గతంలో ఎన్నో రివ్యూల పై ఎంతోమంది సెలబ్రిటీలు మండిపడ్డారు కూడా అయితే మేము డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు మాకు సినిమా మీద మాట్లాడే హక్కు ఉంటుంది అంటూ ఎంతోమంది రిటర్న్ గా కౌంటర్ ఇచ్చారు.
ఇక వారితో పెట్టుకోవడం ఎందుకంటూ ఎంతోమంది సినిమా స్టార్స్ సైలెంట్ ఇవ్వడం మనం చాలా చూశాం కూడా. ముఖ్యంగా సోషల్ మీడియా జమానా ఎక్కువైపోయాక యూట్యూబ్ ఛానల్, ఇంస్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ వీడియోలు ఎక్స్ లు అంటూ ఇబ్బడి ముబ్బడిగా రివ్యూ చెప్పే వాళ్ళు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే .
మంచి కన్నా చెడే ఎక్కువ
ఇక సినిమాని బ్రేక్ చేసే పేరిట లు ఎంత యాగి చేస్తారో చెప్పక్కర్లేదు. అయితే మంచి సినిమాలకి రివ్యూయర్స్ భుజాలు రాసిన సందర్భాలు కూడా బోలెడు. కానీ మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందన్నది ఇండస్ట్రీ మాట.
రివ్యూయర్లు ఎలా రివ్యూ ఇస్తారో
ఇప్పుడు ఇదే విషయంపై రాధిక కూడా తన బాధను బయటపెట్టింది. ఒక సినిమా బాగున్నా కావాలనే చెడ్డదిగా చూపించడం అంటే పర్సనల్ అజెండాతో కంటెంట్ ని కిల్ చేయడమే అని, అది ఇండస్ట్రీకి చాలా ఇబ్బంది అని చెప్పుకొచ్చింది.
also read :చేతిలో క్యాష్ ఉందా?.. కాస్త జాగ్రత్త.. వేణుస్వామి షాకింగ్ వార్నింగ్!
సినిమా నచ్చకపోతే విమర్శించండి కానీ అది సినిమా వరకే పరిమితం కావాలంటూ సూచించింది. మరి రాధిక చేసిన ఈ కామెంట్స్ పై రివ్యూయర్లు ఎలా రివ్యూ ఇస్తారో చూడాలి!