Chandra Bose: ఒకప్పుడు ఆస్కార్ అంటే అది ఎక్కడో ఉంటుంది దానిని అందుకోవటం కష్టం అని అందరికీ అనిపించేది. తెలుగు సినిమా ఒకరోజు ఆ స్థాయికి వెళుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ తెలుగు సినిమా స్థాయికి వెళ్ళింది. ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది. దానిలోని నాటు నాటు పాటకే అవార్డు వచ్చింది. ఆ పాటను రాసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డును చాలామంది వద్దకు తీసుకెళ్లారు. తన జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు. చంద్ర బోస్ ఎంత అద్భుతంగా రాస్తారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక దర్శకుడు ఏకంగా చంద్ర బోస్ ను బెదిరించాడు.
పాట రాయికపోతే చచ్చిపోతా
30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు మున్నా. ప్రదీప్ (Anchor Pradeep) నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం అనే పాట మంచి పాపులర్ అయింది. ఇప్పటికీ కూడా ఆ పాటను చాలామంది విపరీతంగా పాడుతూనే ఉంటారు. ఒకప్పుడు రీల్స్ లో ఈ పాట బాగా ఫేమస్. ఇప్పటికీ కూడా ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను చంద్రబోస్ (Chandra Bose) రాశారు ప్రస్తుతం ఆ పాటకు సీక్వెల్ కావాలని దర్శించడం మున్నా (director Munna) అడుగుతున్నాడు. పాటకు సీక్వెల్ అడగడం కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంతకు మేటర్ ఏంటంటే..
పాటకు సీక్వెల్ ఏంటి
ప్రస్తుతం ఉన్న బ్యాడ్ గర్ల్స్ (Bad Girlz) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం అనే పాటకు సీక్వెల్ కావాలి అంటూ రచయిత చంద్రబోస్ ని అడిగాడు. దానికి సీక్వెల్ ఏంటి అని చంద్రబోస్ అనగానే, మెడ పైన కత్తి పెట్టి పాట రాయకపోతే నేను చచ్చిపోతాను సార్ అంటూ బెదిరించారు. పుష్ప 2 (Pushpa 2) రాశారు. చాలా సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి ఒక పాటకు సీక్వెల్ రాయమంటే రాయరా అంటూ ప్రశ్నించాడు. వెంటనే చంద్రబోస్ రాస్తాను అనడం, గిటార్ పట్టుకుని అనుప్ రూబెన్స్ (Anup Rubens ) పాట ఇవ్వడం అంతా జరిగిపోయింది. మొత్తానికి మీరు ఒక పాటను సిద్ధం చేశారు. ఈ ప్రాంక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Mega157 : టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి, ఇక సంక్రాంతి లేనట్లేనా?