BigTV English

Shivani Nagaram: అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు శివాని.. సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మలు?

Shivani Nagaram: అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు శివాని.. సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మలు?

Shivani Nagaram: సినిమా ఇండస్ట్రీ అనే ప్రపంచంలోకి కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తుంటే పాత వాళ్ళు ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలలో నటిస్తున్న వారిలో నటి శివాని నాగారం (Shivani Nagaram)ఒకరు. సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ (AmbajiPeta Marriage Band ) సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


వరుస చాన్సులు కొట్టేస్తున్న శివాని..

ఇలా తన మొదటి సినిమాతోనే నటిగా తనని తాను నిరూపించుకుంటూ అనంతరం వరుస సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె లిటిల్ హార్ట్(Little Heart) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేసింది. ఇక ఈ సినిమాతో పాటు శివాని హే భగవాన్ అనే సినిమాలో కూడా అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తుంది.


శ్రీదేవి బాటలోనే శివాని..

నిజానికి ఈమె అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో ఫ్రెండ్ పాత్ర కోసం ఆడిషన్ కి వెళ్ళగా హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు. ఇలా అనుకోకుండా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన శివాని ఏకంగా మరో రెండు సినిమా అవకాశాలను అందుకోవడంతో ఈమె కాస్త వార్తల్లో నిలిచారు. ఇక లిటిల్ హార్ట్ సినిమా కనుక మంచి ఆదరణ సొంతం చేసుకుంటే ఇండస్ట్రీలో శివానికి తిరుగు ఉండదని చెప్పాలి. అయితే గతంలో కూడా కోర్టు సినిమా ద్వారా కాకినాడ శ్రీదేవి(Sridevi) సినిమా అవకాశాన్ని అందుకున్నారు. ఇలా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీదేవి ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతే తెలిసిందే.

సింగర్.. కూచిపూడి డాన్సర్…

ఈ విధంగా శ్రీదేవి బాటలోనే శివాని కూడా కెరియర్ పరంగా సౌత్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు అచ్చ తెలుగు అమ్మాయిలు కావటం విశేషం శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి కాగా, శివాని హైదరాబాద్ కు చెందిన అమ్మాయి. ఇక శివాని కేవలం నటిగా మాత్రమే కాకుండా మంచి సింగర్ అని కూడా చెప్పాలి .అలాగే కూచిపూడి డాన్సర్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇలా మల్టీ టాలెంట్ కలిగిన శివాని సినిమాల పరంగా ఎంతో బిజీగా గడుపుతూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక లిటిల్ హార్ట్ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో 90’s ఫేమ్ మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Samantha: మరో గౌరవం అందుకున్న సమంత.. ప్రముఖ  మ్యాగజైన్ పై మెరిసిన నటి!

Related News

OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

Sandhya Shantaram: ప్రముఖ నటి కన్నుమూత, బాలీవుడ్ లో అలుముకున్న విషాదఛాయలు

Tollywood: శశివదనే ప్రెస్ మీట్.. క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే!

Kalki 2: నాగ్ అశ్విన్ మూవీలో సాయి పల్లవి.. కల్కి 2లోనా? వేరే మూవీనా? ఇదిగో క్లారిటీ

Rahul Ramakrishna: ట్రోల్స్ ఎఫెక్ట్… ప్రజా సేవలోకి దిగిన రాహుల్ రామకృష్ణ

Hrithik Roshan: వార్ 2 సినిమాపై ఓపెన్ అయిన హృతిక్.. గాయంలా ఉండాల్సిన పనిలేదంటూ!

Zubeen Garg: ప్రమాదం కాదు.. విషమిచ్చి చంపారు… సింగర్ కేసులో బిగ్ ట్విస్ట్?

Srinidhi Shetty: అందరూ నన్ను లేడీ ప్రభాస్ అంటారు.. డార్లింగ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే?

Big Stories

×