Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 157 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం స్వతహాగా అనిల్ రావిపూడి స్ట్రెంత్ కామెడీ కావడం, అలానే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి (megastar Chiranjeevi) కూడా కంప్లీట్ కామెడీ సినిమా చేసి చాలా రోజులు అవ్వడం.
మెగాస్టార్ లోని డాన్స్ మూమెంట్స్ ను ఎంతలా ఇష్టపడతారు. అలానే కామెడీ టైమింగ్ కూడా ఇష్టపడతారు. బాబీ (Bobby) దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య (Valtheru Veerayya) సినిమా హిట్ అవ్వడానికి కూడా ఇది ఒక కారణం. అయితే మెగాస్టార్ 157వ సినిమా గురించి ఆగస్టు 22న క్లారిటీ వస్తుంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆరోజు పోస్టర్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. మరోవైపు విశ్వంభర (Vishwambhara) యూనిట్ కూడా టీజర్ రెడీ చేస్తుంది.
టైటిల్ పై క్లారిటీ
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి దిల్ రాజు కి కాసుల వర్షం కురిపించింది. వాస్తవానికి గేమ్ చేంజర్ ఆ ప్రొడక్షన్ హౌస్ కు డేంజర్ గా మారింది. ఆ లోటును సంక్రాంతికి వస్తున్నాం సినిమా భర్తీ చేసింది. అయితే మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు అని అనౌన్స్ చేసినప్పుడు, ఆ సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది కాబట్టి టైటిల్ కూడా సంక్రాంతి పేరుతో కూడుకొని ఉంటుంది అనుకున్నారంతా. కానీ అనిల్ రావిపూడి దాని గురించి క్లారిటీ ఇచ్చేసాడు. పేరులో సంక్రాంతి లేదు అని తేల్చి చెప్పేసాడు.
సంక్రాంతి లేదు వదిలేయ్
మౌళి టాక్స్ నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా టీజర్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా అనిల్ రావిపూడి హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో మౌళి మీ టైటిల్ ఇదే అంటూ కొన్ని పేర్లు చదివాడు. సంక్రాంతికి క్రొకోడైల్ ఫెస్టివల్, సంక్రాంతికి రఫ్ ఆడిస్తా, సంక్రాంతికి శంకర్ దాదా కమింగ్ అని చెప్పాడు మౌళి. దీనితో టైటిల్ లో సంక్రాంతి లేదు వదిలే అంటూ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. ఇక సినిమా అప్డేట్ గురించి అడిగితే రెండు రోజులు వెయిట్ చేయండి 22న బద్దలైపోద్ది అంటూ తన స్పీచ్ లో చెప్పాడు. మొత్తానికి ఈ సినిమా నుంచి 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ అయితే వస్తుంది అని ఏకంగా అనిల్ కూడా క్లారిటీ ఇచ్చాడు.
Also Read: Nikhil Abburi: 100% లవ్ బుడ్డోడు, ఇప్పుడు ఎలా అయిపోయాడో, బన్నీ వాస్ కి షాక్.!