భారతీయ రైల్వే ఎన్నో వింతలు విశేషాలను కలిగి ఉంది. అద్భుతమైన మార్గాలతో ఆకట్టుకుంటుంది. ఎత్తైన బ్రిడ్జిలు, నదీ గర్భంలో టన్నెల్స్, కొండలను మధ్య నుంచి దూసుకెళ్లే దారులు ఉన్నాయి. ఇప్పుడు మరో వింత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అదే డైమండ్ రైల్వే క్రాసింగ్. రైల్వే ఇంజనీరింగ్ లో ఒక ప్రత్యేక రకమైన ట్రాక్ జంక్షన్ ను డైమండ్ క్రాసింగ్ అంటారు. ఇక్కడ నాలుగు రైల్వే ట్రాక్‌లు కలిసి డైమండ్ ఆకారంలో కనిపిస్తాయి. సాధారణంగా రెండు, అంతకంటే ఎక్కువ ట్రాక్‌లు ఒకే చోట కలిసే ప్రదేశాన్ని డైమండ్ రైల్వే క్రాసింగ్ అంలారు.
మన దేశంలో పాపులర్ డైమండ్ క్రాసింగ్ బల్హార్ షా దగ్గర ఉంది. ఇది మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతలో ఉంటుంది. ఇక్కడ నాలుగు రైల్వే లైన్లు కలుస్తాయి. కోల్ కతా (తూర్పు) నుంచి ముంబై (పశ్చిమం) వరకు, ఢిల్లీ (ఉత్తరం) నుంచి చెన్నై (దక్షిణం) వరకు ప్రధాన రైలు మార్గాలు కలుస్తాయి. ఇక్కడి నుంచి రోజుకు 300 పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. దీనిని 1950 లలో నిర్మించారు. భారతీయ రైల్వేల అద్భుతాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
సాధారణ లెవెల్ క్రాసింగ్ లో రోడ్, రైలు ట్రాక్ కు మధ్య గేట్లు ఉంటాయి. రైళ్లు వచ్చే సమయంలో గేట్లు వేస్తారు. కానీ, డైమండ్ క్రాసింగ్ రైలు ట్రాక్ ల మధ్య ఉంటుంది. అంటే రెండు రైల్వే లైన్లు ఒకదానికొకటి కలిస్తాయి. ఇక్కడ రైల్వే సిగ్నల్స్, స్విచ్ లు రైళ్లు ఒకేసారి రాకుండా ఆపుతారు. ఇక్కడ అత్యంత కచ్చితమైన టైమింగ్ అవసరం. ఎందుకంటే, రెండు రైళ్లు ఒకేసారి వస్తే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
డైమండ్ క్రాసింగ్ అనేది రైల్వే నెట్ వర్క్ ను సమర్థవంతంగా కనెక్ట్ చేస్తుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రవాణా ఖర్చును ఆదా చేస్తుంది.
భారత్ లో బల్హార్ షా డైమండ్ క్రాసింగ్స్ తో పాటు దేశంలో మరికొన్ని డైమండ్ క్రాసింగ్‌లు కూడా ఉన్నాయి
⦿ నాగ్ పూర్ జంక్షన్ (మహారాష్ట్ర): ఇక్కడ కూడా పలు రైల్వే లైన్లు కలుస్తాయి. కానీ, బల్హార్‌షా అంత ఫేమస్ కాదు.
⦿ విజయవాడ జంక్షన్ (ఆంధ్రప్రదేశ్): ఇది కూడా ముఖ్యమైన రైల్వే జంక్షన్ గా కొనసాగుతోంది. కానీ, డైమండ్ క్రాసింగ్ గా గుర్తింపు తక్కువగా ఉంది.
బల్హార్ షా లాంటి జంక్షన్లు రైల్వే ఔత్సాహికులకు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో రైళ్లు ఎలా క్రాస్ అవుతాయో చూసేందుకు ప్రత్యేకంగా పర్యాటకులు తరలిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఇలాంటి డైమండ్ క్రాసింగ్స్ సాంకేతిక అద్భుతాలకు చిహ్నంగా నిలుస్తున్నాయి.
Read Also: డైమండ్ క్రాసింగ్ To ఫెయిరీ క్వీన్.. ఇండియన్ రైల్వేలో 7 అద్భుతాలు!