Balakrishna: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. బాలయ్య తన సినిమాలతో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య త్వరలోనే ఆఖండ 2(Akhanda 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో డిసెంబర్ ఐదో తేదీ విడుదల కాబోతోంది అంటూ వార్తలు వినపడుతున్నాయి.
గోపీచంద్ మలినేని సినిమా తర్వాతే..
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తిరిగి మరోసారి డైరెక్టర్ గోపిచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో వీర సింహారెడ్డి (Veera Simha Reddy)సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే బాలయ్య మరోసారి గోపీచంద్ మలినేనికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన తదుపరి సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ఎప్పటి నుంచో ఆదిత్య 369 (Aditya 369)సినిమాకు సీక్వెల్ సినిమా రాబోతుందని చెబుతూ వచ్చారు.
ఆదిత్య 369 సీక్వెల్..
ఈ సినిమాలో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా ఉండబోతున్నారంటూ గతంలో వార్తలు వినిపించాయి అయితే తాజాగా బాలకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ సినిమా ఖచ్చితంగా ఉంటుందని అయితే గోపీచంద్ మలినేనితో తన సినిమా పూర్తి అయిన వెంటనే ఆదిత్య 369 సీక్వెల్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి అంటూ ఈయన తెలియజేశారు. మరి ఈ సినిమా ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది తెలియదు కానీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ రాబోతుంనే విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు…
ఇక బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలు అలాగే రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈయన 50 సంవత్సరాల తన సినీ కెరియర్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్) లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే .అయితే ఇప్పటి వరకు భారతదేశ సినీ చరిత్రలోనే ఇలాంటి గౌరవం ఏ ఒక్క హీరోకి కూడా లభించలేదు. ఇలాంటి పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా బాలయ్య నిలిచారనే చెప్పాలి. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే అఖండ 2 సినిమా షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడనే విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.
Also Read: Vishal: పెళ్లికి ముందే విశాల్ సంచలన నిర్ణయం.. ఇకపై అలా చూడలేమా?