Nivetha Pethuraj:సినీ సెలబ్రిటీలు ఎప్పుడు? ఎవరితో? ఎలా ప్రేమలో పడతారో? చెప్పడం అంత సులభం ఏమీ కాదు. ముఖ్యంగా తాము ప్రేమించిన వారిని వెంటనే పరిచయం చేస్తారా? అంటే చెప్పలేని పరిస్థితి. కొంతమంది ప్రేమలో పడిన విషయాన్ని అభిమానులతో పంచుకుంటే.. మరికొంతమంది ఏకంగా పెళ్లి గురించి చెప్పి ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం తాను ప్రేమలో పడ్డ విషయాన్ని అభిమానులతో చెబుతూనే…ఆ ప్రేమ ఎలా మొదలైంది ? అనే విషయాన్ని కూడా ఆమె పంచుకున్నారు. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj).
లవ్ స్టోరీ బయటపెట్టిన నివేదా పేతురాజ్..
ఆగస్టు 27న దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు.. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆమె తన ప్రియుడిని పరిచయం చేసింది.. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్ (Rajith Ibran) తో రిలేషన్ షిప్ లో ఉన్నానంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇతడితో పరిచయం, ప్రేమ, పెళ్లి అనే విషయాలపై మాట్లాడుతూ.. “ఐదేళ్ల క్రితం దుబాయ్ లో ఒక రేసింగ్ సందర్భంగా రజిత్ తో నాకు పరిచయం ఏర్పడింది. మొదట స్నేహితులుగా మారాము. ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమికులమయ్యాము. ముఖ్యంగా మా ప్రేమ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇండస్ట్రీలో అయితే ఇంకా ఎవరికీ తెలియదు. సడన్గా మా ప్రేమ విషయం బయట పెట్టడంతో ఆఖరికి నా మేనేజర్ కూడా ఆశ్చర్యపోయారు. అంతలా నేను నా ప్రేమ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు”. అంటూ తెలిపింది నివేదా. ఇది చూసిన ఆడియన్స్ సినిమా తీసేయొచ్చు ఈజీగా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
అప్పుడే నిశ్చితార్థం.. అక్కడే పెళ్లి..
నిశ్చితార్థం, పెళ్లి గురించి మాట్లాడుతూ.. “మా ఎంగేజ్మెంట్ అక్టోబర్ లో ఉండనుంది. ఆ తర్వాత జనవరిలో పెళ్లి చేసుకుంటాము. అయితే డేట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. కానీ ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం మా ఇద్దరి కుటుంబాలు దుబాయ్ లోనే ఉన్నాయి. అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా మేము పెళ్లి చేసుకోబోతున్నాం” అంటూ నివేదా చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే నివేదా త్వరలో పెళ్లికూతురు కాబోతోందని తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నివేదా పేతురాజు సినిమాలు..
‘మెంటల్ మది’ లో అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. అలవైకుంఠపురంలో, బ్రోచేవారెవరురా, విరాటపర్వం, చిత్ర లహరి, పాగల్, రెడ్, దాస్ కా దమ్కీ ఇలా పలు చిత్రాలలో నటించింది. ఈమె హీరోయిన్ గానే కాకుండా కార్ రేసింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లో కూడా సత్తా చాటింది. ప్రస్తుతం ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఈమె ఇంకా కొత్త సినిమాలను ప్రకటించలేదు.
ALSO READ:Rashmika Mandanna: సక్సెస్ రుచి మింగుడు పడలేదా.. అందుకే ఇలా చేస్తోందా?