Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal) ఇటీవల తన 48వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్తను తెలియజేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న ఈయన కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు.. ఇలా హీరోగా ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న విశాల్ తన పెళ్లి గురించి అభిమానులకు శుభవార్తను తెలిపారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈయన నటి సాయి దన్సిక(Sai Dhanshika)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 29వ రోజు ఈ జంట నిశ్చితార్థం(Engagment) జరుపుకొని నిశ్చితార్థపు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
నిశ్చితార్థం జరుపుకున్న విశాల్…
ఇక వీరి నిశ్చితార్థపు ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే తన వివాహం (Wedding) మరో రెండు నెలలలో జరగబోతుందని విశాల్ వెల్లడించారు. ప్రస్తుతం నడియార్ సంఘం భవనం నిర్మాణం జరుగుతోందని, ఈ భవన నిర్మాణం అనంతరం తన వివాహం జరగబోతుందని పలు సందర్భాలలో వెల్లడించారు. అయితే మరొక రెండు నెలలలో ఈ భవన నిర్మాణం పూర్తి కావడంతో ఈ భవనాన్ని ప్రారంభించి అందులోనే తన వివాహాన్ని చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇక వివాహం తర్వాత సినిమాల విషయంలో విశాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
లిప్ కిస్ సన్నివేశాలకు దూరం..
పెళ్లి తర్వాత ఈయన రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి అభ్యంతరం లేకపోయిన ఆన్ స్క్రీన్ లిప్ కిస్ సన్నివేశాలలో నటించనని తెలియజేశారు. దేవుడు నాకోసం దేవకన్య లాంటి ధన్సికను పంపించారు అంటూ ఈయన తన కాబోయే భార్య గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి తర్వాత అభిమానులు విశాల్ ను కిస్ సన్నివేశాలలో నటించడం చూడలేరని ఈ సందర్భంగా స్పష్టమవుతుంది. ఇక దన్సిక వయసులో విశాల్ కంటే దాదాపు 12 సంవత్సరాలు చిన్నదనే విషయం తెలుస్తుంది. అయితే ఇదివరకే విశాల్ మరొక నటితో నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల వీరి నిశ్చితార్థం రద్దు కావడంతో తిరిగి ఈయన దన్సికతో ఏడడుగులు వేయబోతున్నారు.
తెలుగులోనూ ఎంతో క్రేజ్…
ఇక విశాల్ సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలతో పాటు రొమాంటిక్ సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈయనకు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడతాయనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా విశాల్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ధన్సిక కూడా తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
Also Read: SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?