Trolls On Shubman Gill Jersy Over Zomato T shirt: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India ODI) జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా బుధవారం తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అరుదైన రికార్డులు, అద్భుతమైన సంఘటనలు, వర్షం అంతరాయాలు అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ను ( Shubman Gill) ఉద్దేశించి పాకిస్తాన్ సోషల్ మీడియా ఘోరంగా ట్రోల్ చేస్తోంది.
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో శుభమాన్ గిల్ వేసుకున్న జెర్సీ… జొమాటో యూనిఫాం లాగా ఉందంటూ హేళన చేస్తూ ఆడుకుంటున్నారు. బీసీసీఐ దగ్గర కోట్ల డబ్బులున్నా, కెప్టెన్ శుభమాన్ గిల్ కు జొమాటో యూనిఫాం ఇవ్వడం అవమానించడమే అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలిలో ఉన్న కొందరు కావాలనే…శుభమాన్ గిల్ ను టార్గెట్ చేశారని, అందుకే ఇలాంటి జెర్సీ వేసేలా ప్లాన్ చేసి ఉంటారని ఆరోపణలు చేశాడు. దీనిపై వెంటనే విచారణ చేసి, గిల్ కు న్యాయం చేయాలంటూ పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గిల్ ఫోటోలపై తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో గిల్ జెర్సీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ తొలి వన్డే సందర్భంగా ధరించిన జెర్సీ నిజంగానే భిన్నంగా ఉంది. టీమిండియా ప్లేయర్లందరి జెర్సీలు ఒకలా ఉంటే, గిల్ ది మాత్రం జొమాటో టీ షర్ట్ తరహాలోనే ఉందని నెటిజెన్స్ సైతం రియాక్ట్ అవుతున్నారు. బ్లూ జెర్సీ ఓకే కానీ, గిల్ చేతులకు ఎర్రటి గుడ్డలు పెట్టుకోవడం దరిద్రంగా ఉందంటున్నారు. వాటి కారణంగా టీమిండియా జెర్సీ కాస్త జొమాటో టీ షర్టులాగానే మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. నెక్ట్స్ మ్యాచ్ లో ఇలాంటి జెర్సీలు వేసుకోవందని కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా, ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ టీమ్ 40.2 ఓవర్లలో 185 పరుగులు సాధించింది. ఈ టార్గెట్ ను టీమిండియా అవలీలగా ఛేదించింది. 22.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించి, విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో వన్డే సిరీస్ లో 1-0 తేడాతో లీడ్ సాధించింది.