BigTV English

Balakrishna : జగన్ ఓ సైకో గాడు… చిరంజీవిని గేట్ దగ్గరే..

Balakrishna : జగన్ ఓ సైకో గాడు… చిరంజీవిని గేట్ దగ్గరే..

Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna)ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నందమూరి నట వారసుడిగా బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన అనంతరం హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇప్పటికీ కూడా బాలకృష్ణ వరుస సినిమాలకు కమిట్ అవుతూ యువ
హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయ వ్యవహారాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే(MLA) అభ్యర్థిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.


సైకో జగన్..

ఇక ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై గత ముఖ్యమంత్రి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. గత ప్రభుత్వంలో సినిమా టికెట్లు రేట్లు పెంచమని కోరుతూ పలువురు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని(Jagan Mohan Reddy) కలిసిన సంగతి తెలిసిందే. ఇదే విషయం గురించి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరంజీవి(Chiranjeevi) గట్టిగా మాట్లాడటం వల్లే జగన్ చర్చలకు వచ్చారని తెలిపారు. అయితే ఈ విషయం పట్ల బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే సమావేశం జరిగిందని చెప్పడం పూర్తిగా అబద్ధమని తెలిపారు.

తొమ్మిదో స్థానంలో బాలయ్య పేరు..

సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి గురించి టికెట్ల రేట్ల పెంపుదల గురించి గతంలో సైకో గాడిని కలవడానికి ఇండస్ట్రీకి చెందిన కొంతమంది వెళ్లారు. అయితే చిరంజీవి గట్టిగా మాట్లాడితేనే జగన్ దిగివచ్చారని అంటున్నారు. అది ఏమాత్రం నిజం కాదని తెలిపారు. ఇక ఈ సమావేశంలో పాల్గొనడానికి తనకు కూడా ఆహ్వానం వచ్చింది. ముఖ్యమంత్రిని కలవడానికి పలువురు సినీ ప్రముఖుల జాబితాను సిద్ధం చేయమని చెబితే ఫిలిం ఛాంబర్ తన పేరును తొమ్మిదో స్థానంలో పెట్టారని బాలయ్య తెలిపారు. అయితే తన పేరును తొమ్మిదో స్థానంలో పెట్టినది ఎవరు అంటూ ఇప్పుడు తాను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ను అడిగానని బాలకృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు.


సినిమా అభివృద్ధి గురించి గత ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళింది చిరంజీవి గట్టిగా మాట్లాడటంతో కాదని, ఆయన గట్టిగా మాట్లాడితే గేటు దగ్గరే ఆపేశారా? అంటూ ఈ సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని సినీ సెలబ్రిటీలు కలిసిన తీరుపై ఇప్పటికి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక బాలకృష్ణ సినీ కెరియర్ విషయానికి వస్తే.. ఇటీవల ఈయన డాకు మహారాజ్ సినిమాతో మంచి హిట్ కొట్టారు. త్వరలోనే అఖండ 2(Akhanda 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు చిత్ర బృందం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రం గోపీచంద్ మలినేనితో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

Related News

Jagapathi Babu: అవినీతి కేసులో ఇరుక్కున్న జగపతిబాబు… నేడు ఈడి విచారణ

OG Movie: ఓజీ టీంకి హైకోర్టులో స్వల్ప ఊరట

Neha Shetty: బంగారం రా మా టిల్లు పాప.. ఓజీలో ఎలా లేపేశారురా

Manchu Laxmi: అనుకున్నది సాధించిన మంచు లక్ష్మీ.. క్షమాపణ చెప్పిన జర్నలిస్ట్

OG Movie: ఓజీ షోలో విషాదం…ప్రమాదంలో ఇద్దరు పవన్ ఫ్యాన్స్

OG Movie: హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని పవన్.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడా ..?

Jayam Ravi: భార్యా పిల్లలను రోడ్డుకీడుస్తున్న జయం రవి.. ఏకంగా ఇంటినే వేలం వేస్తూ!

Big Stories

×