NBK 112:బాలయ్యా …నువ్ రెస్ట్ తీసుకోవాలి,అసలు షూటింగ్ లో పాల్గొనవద్దు అంటూ గట్టిగా చెప్పేశారు.కానీ బాలయ్య మాత్రం నేను లేకపోతేనేం సినిమా పరుగులు పెట్టాల్సిందే అంటూ ‘NBK 112’ కోసం కొరటాలని పరుగులు పెట్టిస్తున్నాడట. నిజానికి ప్లాన్ ప్రకారం ఆగస్టు ఆఖర్లోనే బాలయ్య తో మొదలెట్టేయ్యాలి.కాని బాలయ్య షూటింగ్ ని సెప్టెంబర్ రెండో వారానికి షిఫ్ట్ చేసేసి బాలయ్య లేని కాంబినేషన్ సీన్లు, ఇతర నటీనటుల సన్నివేశాలను ముందే సెట్స్ మీద లాగించేస్తున్నాడట కొరటాల.
నిజానికి కొరటాల శివ దేవర తర్వాత దేవర 2 చేస్తాడనుకున్నారు అంతా,కానీ తారక్ డేట్స్ దొరకడం కష్టమవడంతో ఇలా బాలయ్యని రంగం లో దించాడు.ఇక కొరటాల సినిమాల విషయానికి వస్తే మిర్చి సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కొరటాల ఆ తర్వాత శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతాగ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించిన సంగతి తెల్సిందే.ఇక చిరు తో తీసిన ఆచార్యని అంత ఈజీగా మర్చిపోలేము కూడా.
బాలయ్య వర్సెస్ ఐశ్వర్య రాజేష్
also read :ఎన్టీఆర్‌కి భుజానికి గాయం..డాక్టర్లు ఏం చెప్పారంటే?
ఇక ఇదిలా ఉండగా డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పవర్‌ఫుల్ రోల్ చేస్తోందనే వార్త ఫిల్మ్ నగర్‌లో తెగ హల్చల్ చేస్తోంది. ఊరికే వచ్చి వెళ్లిపోయే హీరోయిన్ పాత్రలు కాకుండా, బాలయ్య వర్సెస్ ఐశ్వర్య రాజేష్ అన్నట్టు ఒక డిఫరెంట్ ట్విస్ట్ పెట్టడమే కొరటాల మార్క్ మేజిక్! నిజానికి 2010లో వచ్చిన ఆల్ టైమ్ హిట్ ‘సింహా’ సినిమాకు కొరటాల శివ పవర్‌ఫుల్ డైలాగ్స్ అందించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో ఆ సంభాషణలు థియేటర్లలో ఎలాంటి సునామీ సృష్టించాయో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏకంగా డైరెక్టర్‌గా బాలయ్యను ఏ రేంజ్‌లో చూపిస్తారో, ఎలాంటి మాస్-ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలుపుతారో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ వస్తున్నాయి.
‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ కాంబో మళ్లీ రిపీట్
దీంతో పాటు ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో చేస్తున్న ‘NBK 111’ ప్రాజెక్ట్ గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే. ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, మాస్ హీరో మంచు మనోజ్ ఒక మైండ్ బ్లోయింగ్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై హైప్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది.ఇక ఈ మధ్య షూటింగ్‌లో ఊహించని విధంగా బాలయ్య చిట్లించిన నరం గాయం తిరగదోడటం తో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) హాస్పిటల్స్ వైద్యులు ఆయనకు విజయవంతంగా చిన్న సర్జరీ పూర్తి చేశారు. డాక్టర్లు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అని సూచించడంతో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా చిన్న బ్రేక్ పడిన సంగతి తెల్సిందే.