E-Paper
Advertisement

ఎన్టీఆర్‌కి భుజానికి గాయం..డాక్టర్లు ఏం చెప్పారంటే?

ఎన్టీఆర్‌కి భుజానికి గాయం..డాక్టర్లు ఏం చెప్పారంటే?
Advertisement

Jr NTR Shoulder Injury:జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని షాక్ గురిచేసే వార్త బయటకు వచ్చింది. తారక్‌కు ఈ సాయంత్రం భుజానికి గాయం అయినట్లు అఫీషియల్ నోట్ వదిలారు.ఈ వార్త సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానులు తారక్  ఆరోగ్యంపై ఆరా తీయడం ప్రారంభించారు.

భుజానికి గాయం కావడంతో వెంటనే డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారని అన్ని పరీక్షలు చేసిన తర్వాత  ప్రస్తుతం ఎలాంటి పెద్ద ప్రమాదం లేదని ఎన్టీఆర్ టీమ్ అఫీషియల్ గా స్పష్టం చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు తారక్ ఫ్యాన్స్.అయితే గాయం పూర్తిగా మానాలంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని. ఈ సమయంలో ఎలాంటి కఠినమైన శారీరక శ్రమ చేయకూడదని వైద్యులు సూచించినట్లు సమాచారం.

Advertisement

ఎన్టీఆర్‌కు చికిత్సను ప్రముఖ వైద్యులు డా. జే. మధుసూదన్ రావు, డా. ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని మెడికల్ టీమ్ అందిస్తోంది. గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో #GetWellSoonNTR, #StayStrongNTR వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ అనే భారీ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న రిలీజ్ చేస్తామని ఇప్పటికే చెప్పారు కూడా.ఇక  భారీ యాక్షన్ సీక్వెన్స్ తో  తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అభిమానుల్లోభారీ  అంచనాలే  ఉన్నాయి. ప్రస్తుతం వైద్యులు సూచించిన విశ్రాంతి కారణంగా షూటింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది.

తాజా సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ కొంతకాలం పూర్తిగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారని , అవసరమైన ఫిజియోథెరపీతో పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగనుందని తెలుస్తుంది. గాయం పూర్తిగా నయమైన తర్వాతే షూటింగ్‌లలో పాల్గొనాలని వైద్యులు సూచించినట్లు ఇన్ సైడ్ టాక్.

సినిమాల పరంగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆరోగ్యమే ముఖ్యమని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. “తారక్ పూర్తిగా కోలుకుని మళ్లీ అదే ఎనర్జీతో సెట్స్‌లోకి రావాలి” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. మొత్తానికి భుజానికి గాయం వార్త మొదట అభిమానుల్లో టెన్షన్ కలిగించినా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటం, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు అందరి చూపు ఆయన త్వరగా కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు ఎప్పుడు వస్తారన్న దానిపైనే ఉంది.

Related News

ఒకే రోజు ఐదారు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఈ కొట్టుడేంది సామీ!

బాలయ్య బాబు ఆసుపత్రిలో.. కొరటాల సెట్‌లో..జోరుమీదున్న NBK 112

మన చదువుల పీక కోసేస్తున్న AI.. ఆర్జీవీ సంచలనం!

జయకృష్ణ ఎంట్రీకి ఫుల్ జోష్.. ‘ఉక్కిరి బిక్కిరి’ సాంగ్ వైరల్!

“అసలు వీళ్లని ఎవరు కంటున్నారో.. ?” యువతపై ఫైర్ అయిన బాలీవుడ్ క్వీన్!

అదే నాకు భారతరత్న.. అవార్డులపై స్పందించిన సీనియర్ హీరో సుమన్!

రామ్ చరణ్‌కి సర్జరీ సక్సెస్.. కోయంబత్తూర్ హాస్పిటల్‌లో రిస్కీ ఆపరేషన్!

Big Stories

Advertisement
×