E-Paper
Advertisement

స్కూల్ లో పరిచయం.. ఫేస్ బుక్ లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ మామూలుగా లేదే?

స్కూల్ లో పరిచయం.. ఫేస్ బుక్ లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ మామూలుగా లేదే?
Advertisement

Dulquer Salman: దుల్కర్ సల్మాన్ పేరుకే ఈయన మలయాళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా అదే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుని తెలుగు హీరోగానే పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ అనంతరం సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ఈయన ఆకాశంలో ఒక తార(AOT) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 20వ తేదీ విడుదల కాబోతోంది.

నాకంటే చాలా జూనియర్..

ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దుల్కర్ సల్మాన్(Dulquer Salman) జగపతిబాబు(Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 (JNR 2)కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా దుల్కర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తన భార్య అమల్ (Amal)గురించి తనతో లవ్ స్టోరీ గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. అమల్ తన స్కూల్లో జూనియర్ అని తెలిపారు. తనకంటే కూడా ఒక ఐదు సంవత్సరాలు చిన్నదేనని, తాను 12 క్లాసు చదువుతున్న సమయంలో అమల్ సిక్స్త్ క్లాస్ చదువుతోందని దుల్కర్ తెలిపారు.

ఫేస్ బుక్ ద్వారా ప్రేమ…

Advertisement

ఇలా స్కూల్లో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినప్పటికీ ప్రేమ అలాంటిది లేదని అయితే చాలా సంవత్సరాల తర్వాత చెన్నైలో ఉంటున్నప్పుడు మేమిద్దరం అనుకోకుండా ఎదురుపడ్డామని ఈయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇలా పలు సందర్భాలలో ఒకరికొకరు ఎదురు పడటంతో ఫేస్ బుక్ ద్వారా స్నేహితులుగా మారామని, అలా మా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని తెలిపారు. ఇక తామిద్దరం ఫస్ట్ డేట్ వెళ్లినప్పుడు ఇద్దరికీ సంబంధించిన విషయాలు గురించి చాలా మాట్లాడుకున్నాము ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నామని ఆ సమయంలోనే తనపై ప్రేమ ఏర్పడటం తనని పెళ్లి చేసుకోవాలని భావించడం జరిగిందని తెలిపారు.

పెద్దల అంగీకారంతో పెళ్లి…

ఇలా ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి మంచి అవగాహన ఉన్న తరువాత ఇంట్లో వారికి మా ప్రేమ గురించి చెప్పడంతో పెద్దలు కూడా మా ప్రేమను అంగీకరించారని అలా మా వివాహం 2011 డిసెంబర్ 22వ తేదీ చెన్నైలో జరిగిందని దుల్కర్ సల్మాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా స్కూల్లో ఏర్పడిన పరిచయం ఫేస్ బుక్ ద్వారా ప్రేమగా మారి జీవితంలో ఒక్కటయ్యామనే విషయాన్ని ఈయన తెలియచేయడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ దంపతులకు అమీరా సల్మాన్ అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దుల్కర్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: చెక్ బౌన్స్ కేసు… బండ్లన్నకు ఏడాది జైలు శిక్ష..భారీ జరిమాన?

Related News

ENE Repeat రిలీజ్‌కు ముందే హీరోయిన్ ఎమోషనల్.. అసలు ఏమైందంటే?

ఆ ఒక్కపనితో అనుష్క శాశ్వతంగా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిందా?

చెక్ బౌన్స్ కేసు… బండ్లన్నకు ఏడాది జైలు శిక్ష..భారీ జరిమాన?

రేణూ దేశాయ్ హెయిర్ స్టైలిస్ట్ ను చూశారా..ఎంత క్యూట్ గా ఉందో కదా!

అన్నపూర్ణ స్టూడియోలో ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్ చిత్రీకరణ.. పూర్తి వివరాలు ఇవే!

ఈ రోజే బిడ్డకు జన్మనివ్వచ్చేమో..సమంత పోస్ట్ వైరల్!

రాజ్ ఫ్యామిలీతో సమంత స్పెషల్ సీమంతం వేడుక..ఫొటోస్ వైరల్ !

Big Stories

Advertisement
×