E-Paper
Advertisement

హీరోకు లోపముంటే సినిమా సక్సెస్..టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్!

హీరోకు లోపముంటే సినిమా సక్సెస్..టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్!
Advertisement

Tollywood New Trend: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలలో హీరోలను చెవుడు, మూగ వంటి సమస్యలతో చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా హీరోకి లోపం ఉంటే సినిమాలు సక్సెస్ అయినట్టేనని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా హీరోలు లోపం ఉన్న పాత్రలలో నటిస్తూ సాహసం చేస్తున్నారని చెప్పాలి అయితే ఇలాంటి పాత్రల ద్వారా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సినిమాలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు.

లెనిన్ తో హిట్ కొట్టిన అఖిల్..

గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) గూని పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అదేవిధంగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ (Ramcharan)నటించిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెవిటి పాత్రలో కనిపించి సందడి చేశారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇకపోతే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అఖిల్ సైతం వరుస ప్లాప్ సినిమాలను చవిచూశారు. అయితే ఇటీవల అఖిల్ నటించిన లెనిన్(Lenin) సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది.

డెబ్యూ సినిమాతోనే హిట్ కొట్టిన అనీష్..

Advertisement

ఈ సినిమాలో అఖిల్ అందుడి పాత్రలో నటించారు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా నటుడు సాయి అనీష్ (Sai Aniesh)హీరోగా ప్రేక్షకులకు పరిచయమవుతూ ఇట్లు అర్జున(Itllu Arjuna) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమా ప్రయత్నంలోనే ఈయన మూగవాడిగా నటించిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి చాలా మంచి ఆదరణ సొంతం చేసుకుని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమాలన్నీ వరుసగా సక్సెస్ అవడంతో హీరోలు లోపం ఉన్న పాత్రలలో నటిస్తే సినిమాలు సక్సెస్ అని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ అవుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

మాటలు లేని అమ్మాయిగా అనస్వర రాజన్..

ఇలా ఈ సినిమాలు సక్సెస్ కావడంతో ముందు ముందు హీరోలు ఇంకా ఎలాంటి లోపం ఉన్నవారిగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారో తెలియాల్సి ఉంది. ఇక అనస్వరరాజన్ మెగాస్టార్ చిరంజీవి కాకా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఈమె మాటలు లేని అమ్మాయిగా కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పరోక్షంగా చిరంజీవి కూడా ఇట్లు అర్జున సక్సెస్ మీట్ లో చెప్పారని తెలుస్తోంది. మరి మాటలు లేకుండా అనస్వర ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుందా.. ఈ సక్సెస్ ట్రెండ్ ను అలాగే కొనసాగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: స్కూల్ లో పరిచయం.. ఫేస్ బుక్ లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ మామూలుగా లేదే?

Related News

స్కూల్ లో పరిచయం.. ఫేస్ బుక్ లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ మామూలుగా లేదే?

ENE Repeat రిలీజ్‌కు ముందే హీరోయిన్ ఎమోషనల్.. అసలు ఏమైందంటే?

ఆ ఒక్కపనితో అనుష్క శాశ్వతంగా టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిందా?

చెక్ బౌన్స్ కేసు… బండ్లన్నకు ఏడాది జైలు శిక్ష..భారీ జరిమాన?

రేణూ దేశాయ్ హెయిర్ స్టైలిస్ట్ ను చూశారా..ఎంత క్యూట్ గా ఉందో కదా!

అన్నపూర్ణ స్టూడియోలో ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్ చిత్రీకరణ.. పూర్తి వివరాలు ఇవే!

ఈ రోజే బిడ్డకు జన్మనివ్వచ్చేమో..సమంత పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×