E-Paper
Advertisement

బండ్ల గణేష్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి..వీడియో వైరల్

బండ్ల గణేష్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి..వీడియో వైరల్
Advertisement

Bandla Ganesh Daughter Janani Wedding:టాలీవుడ్ కమెడీయన్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి.బండ్ల గణేష్ కూతురు జనని వివాహం సూర్యతేజ తో ఈరోజు JRC కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరుగుతుంది.వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పెళ్లి అత్యంత వైభవంగా జరుగుతుండగా పెళ్లి దంపతులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు.

ఇక కూతురు పెళ్లికి వచ్చిన ప్రముఖుల్ని బండ్ల గణేష్ దగ్గర ఉండి మరీ ఆహ్వానించడం విశేషం. బండ్ల గణేష్ కి సినీ, వ్యాపార రాజకీయాల్లో విశేషమైన పరిచయాలు ఉండటంతో ఈ వేడుక అంతా ప్రముఖులు సందడితో కళకళ లాడిపోయింది.

Advertisement

ప్రముఖుల సందడి 

ఈ వేడుకలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు,తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇతర మంత్రులు కూడా ఈ వేడులకి పాల్గొని దంపతులని ఆశీర్వదించారు,ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకి సంబందించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ఇక ఇప్పుడంటే కాస్త సైలెంట్ గా ఉన్నాడు కాని నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో చెప్పక్కర్లేదు.పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పటి ఇండస్ట్రీ రికార్డులని తుడిచేసి బండ్ల గణేష్ కి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చి పెట్టింది.

ఒక వెలుగు వెలిగిన బండ్ల 

ఇక పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ , అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, చరణ్ తో గోవిందుడు అందరివాడేలే, జూనియర్ ఎన్టీఆర్ తో బాద్ షా, టెంపర్ వంటి సినిమాలని తెరకెక్కించి అప్పట్లో ఒక వెలుగు వెలిగాడు.

ఆ తర్వాత సినిమాలు తగ్గించిన బండ్ల నటుడిగా సరిలేరు నీకెవ్వరు సినిమా తో సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా మొదలెట్టాడు.ఇక ప్రస్తుతం కాస్త సైలెంట్ ఉన్న బండ్ల వచ్చే రోజుల్లో మరిన్ని మంచి  సినిమాలతో ఆడియన్స్ ని మెప్పిస్తానని ఇప్పటికే చెప్పేశాడు కూడా.చూడాలి మరి అప్పట్లో ఒక వెలుగు వెలిగిన బండ్ల మళ్ళీ ఎలాంటి సినిమాతో కమ్ బ్యాక ఇస్తాడో !

మొత్తానికి ఈ సారి సినిమా ఈవెంట్ తో కాకుండా ఇలా తన ఇంట్లోని పెళ్లి వేడుకతో మరోసారి వార్తల్లో నిలిచాడు బండ్ల గణేష్ !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×