E-Paper
Advertisement

మాల్దీవ్స్ కు వెళ్లే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. ఇక అందుబాటులోకి మరిన్ని విమానాలు!

మాల్దీవ్స్ కు వెళ్లే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. ఇక అందుబాటులోకి మరిన్ని విమానాలు!
Advertisement

Maldivian Airlines India: మాల్దీవ్స్ విమానయాన సంస్థ మాల్దీవియన్ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితమైన ఏవియారెప్స్ ఇండియా బాధ్యతలను ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇకపై ఏవియారెప్స్ ఇండియా మాల్దీవియన్‌ కు పాన్ ఇండియా జనరల్ సేల్స్ ఏజెంట్ (GSA)గా పనిచేయనుంది.

భారత్‌పై పెరుగుతున్న ఆసక్తి

మాల్దీవులకు భారతదేశం ముఖ్యమైన పర్యాటక మార్కెట్లలో ఒకటి. దీంతో భారత మార్కెట్‌లో తమ ఉనికిని మరింత బలోపేతం చేయాలని మాల్దీవియన్ భావిస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ట్రావెల్ ఏజెంట్లు, భాగస్వామ్య సంస్థలు, ఇతర వాణిజ్య వర్గాలతో సంబంధాలను పెంచుకోవడంలో ఏవియారెప్స్ ఇండియా సహకారం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏవియారెప్స్ నెట్‌వర్క్, స్థానిక మార్కెట్‌పై ఉన్న అవగాహనను ఉపయోగించుకుని మాల్దీవియన్ తన మార్కెటింగ్ కార్యకలాపాలను విస్తరించనుంది.

భారత్-మాల్దీవుల మధ్య విమాన సర్వీసులు

Advertisement

ప్రస్తుతం మాల్దీవియన్ మాలే నుంచి కొచ్చి, తిరువనంతపురానికి వారానికి ఐదు డైరెక్ట్ విమానాలను నడుపుతోంది. అలాగే హనిమాదూ నుంచి తిరువనంతపురానికి వారానికి రెండు సార్లు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ విమానాల ద్వారా భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా కనెక్టివిటీ లభిస్తోంది. మాల్దీవుల్లోని రిసార్ట్ దీవులు, స్థానిక ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలకు వెళ్లేందుకు కూడా విమానయాన సంస్థ దేశీయ నెట్‌వర్క్ ఉపయోగపడుతోంది.

2025లో 1.9 లక్షల మంది భారతీయ సందర్శకులు

మాల్దీవుల పర్యాటక రంగంలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉంది. 2025లో దాదాపు 1.9 లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించినట్లు మాల్దీవియన్ సంస్థ వెల్లడించింది. విహారయాత్రలతో పాటు బంధువులు, స్నేహితులను కలిసేందుకు చేసే ప్రయాణాలు, వైద్య సేవలు, వ్యాపార ప్రయాణాలు కూడా భారత మార్కెట్‌లో ముఖ్యమైన విభాగాలుగా ఉన్నాయి. ఈ రంగాల్లో మరింత వృద్ధి సాధించే అవకాశం ఉందని మాల్దీవియన్ భావిస్తోంది.

మాల్దీవియన్ ఏమంటోంది?

Advertisement

భారత్ ను పర్యాటకం, ప్రాంతీయ కనెక్టివిటీ రెండింటికీ వ్యూహాత్మకంగా కీలకమైన మార్కెట్ గా భావిస్తున్నట్లు మాల్దీవియన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రహీం ఇయాస్ వెల్లడించారు. ఏవియారెప్స్ ఇండియా పరిధిని దేశవ్యాప్తంగా విస్తరించడం ద్వారా తమ  కార్యకలాపాలను మరింత సమన్వయంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత్-మాల్దీవుల మధ్య ప్రయాణ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడమే తమ లక్ష్యమన్నారు.

మాల్దీవియన్ భవిష్యత్తులో తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇటీవల తన ఫ్లీట్‌లో చేరిన ఎయిర్‌బస్ A330 వైడ్‌బాడీ విమానంతో పాటు కొనసాగుతున్న ఫ్లీట్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు ఈ విస్తరణకు తోడ్పడనున్నాయి. భారతదేశం నుంచి మాల్దీవులకు ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, మరిన్ని నగరాలకు కనెక్టివిటీ, అదనపు సర్వీసులు అందించే అవకాశాలను సంస్థ పరిశీలిస్తోంది. దీంతో భారత్‌ లో మాల్దీవియన్ కార్యకలాపాలకు మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.

Read Also: వందే భారత్ స్లీపర్‌పై బిగ్ అప్డేట్.. 24 బోగీల రైలు వచ్చేస్తోంది!

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×