BigTV English

Bandla Ganesh: ఇండస్ట్రీలో మాఫియా బతకనివ్వదు.. పచ్చి నిజాలు మాట్లాడిన బండ్లన్న

Bandla Ganesh: ఇండస్ట్రీలో మాఫియా బతకనివ్వదు.. పచ్చి నిజాలు మాట్లాడిన బండ్లన్న

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కమెడియన్ గా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. ఆ తరువాత నిర్మాతగా కూడా అంతే మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తరువాత కొన్ని అనుకోని కారణాలు ఆయనను ఇండస్ట్రీకి దూరం చేశాయి. బండ్ల గణేష్ బోళా మనిషి. ఎవరు ఎదురు ఉన్నా మనసులో ఉన్నది నిస్సంకోచంగా బయట పెట్టేస్తాడు. దానివలన అతను ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కున్నాడు. కానీ, అతని వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు.


బండ్ల గణేష్ స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బండ్లన్న ఏది మాట్లాడినా అందులో ఒక నిజం ఉంటుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఈవెంట్స్ లో తప్ప  బయట ఎక్కడా ఎక్కువ కనిపించని బండ్లన్న కావాలనే లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లి మౌళీకి ఇండస్ట్రీ గురించి పచ్చి నిజాలు చెప్పాడు. నిజం చెప్పాలంటే అంత నిక్కచ్చిగా.. అందులోనూ అల్లు అరవింద్ లాంటి స్టార్ నిర్మాత ముందు అంత పచ్చిగా చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. అది కేవలం బండ్లన్న మాత్రమే చేయగలడు.

సినిమా గురించి పక్కన పెడితే.. ఇండస్ట్రీలో ఉన్న మాఫియా గురించి బండ్లన్న మాట్లాడిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అది కేవలం మౌళీకి మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి హీరో తెలుసుకోవాల్సిన నిజం. ఇండస్ట్రీ ఒక మాయ ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించేది ఏది నిజం కాదు. పొగడ్తలు నిజం కాదు.. ప్రేమ నిజం కాదు.. అసలు ఇండస్ట్రీనే నిజం కాదు అని బల్లగుద్ది చెప్పాడు బండ్ల గణేష్.


“మౌళీ.. నీకో మాట చెప్తాను. ఈ 20 రోజుల్లో జరిగిందంతా అబద్దం. ఒక కల్పన. ఒక 3డి అనుకొని కళ్ళజోడు తీసేయ్. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఎలా ఉన్నవో.. అదే స్టేటస్ మీద ఉండు. నాలాంటి వాడు నీ దగ్గరికి వచ్చి మౌళీ గారు.. మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి. మీ ముందు విజయ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికి వస్తారు అని అంటారు. అవన్నీ నమ్మకు. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ మాదిరిగా మౌళీ ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా. మీది ఎక్కడ.. గాజువాక కదా.. దాని బేస్ మర్చిపోకు. ఈ  ఫిలిం నగర్, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఫోటోలు, పొగడ్తలు.. ఇదంతా అబద్దం.ఇంటికి వెళ్తే నీ వాస్తవంలోకి వెళ్ళిపో. నేను రోజూ ఇంటికెళ్లాక షాద్ నగర్ లోని నా కోళ్ల పారమ్ ని గుర్తు తెచ్చుకుంటా. లేకపోతే వీళ్లు మనల్ని బ్రతకనివ్వరు. ఈ మాఫియా మనల్ని బ్రతకనివ్వదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి” అని బండ్లన్న చెప్పిన విధానం వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

నిజంగా ఇండస్ట్రీలో జరుగుతుంది ఇదే. రౌడీ షర్ట్ ఇచ్చాడు.. మహేష్ బాబు ట్వీట్ వేశాడు.. అని చంకలు గుద్దుకొని సినిమా హిట్ అయ్యిందని స్టార్ అని తిరిగితే.. తిరిగి తొక్కేసేది కూడా అదే పెద్ద పెద్ద స్టార్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఎదుగుతూ ఉంటే చెయ్యి వేసి శభాష్ అనేవాళ్ళు ఉంటారు కానీ, ఇండస్ట్రీ తీరు ఇది.. నువ్వు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు  చాలా తక్కువ. అందులో బండ్ల గణేష్ లా ముఖం మీద చెప్పేవాళ్లు ఇంకా తక్కువ. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూడా బండ్లన్న చెప్పిందే నిజం అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి మౌళీ.. బండ్ల గణేష్ చెప్పింది వింటాడా.. ? లేదా ..? అనేది చూడాలి.

Related News

RK Roja: మరో అరుదైన అవార్డు అందుకున్న రోజా సెల్వమని కూతురు!

Sharwanand: షాకింగ్.. శర్వానంద్ విడాకులు.. ?

Bandla Ganesh: పొగుడుతూనే పొగ పెట్టేసిన బండ్లన్న.. అల్లు అరవింద్ రియాక్షన్!

Theater Movies: ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 2 సినిమాలు మస్ట్ వాచ్..

Tamil Actor: తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

Ravi Basrur: ఊరు పేరునే తన పేరుగా మార్చుకున్న సంగీత దర్శకుడు.. అసలు పేరేంటంటే ?

Director Bobby: ‘మన శంకర వరప్రసాద్‌ గారూ’ మూవీపై డైరెక్టర్‌ బాబీ రివ్యూ.. ఏమన్నారంటే!

Big Stories

×