E-Paper
Advertisement

ఆ క్షణాలకు మాటలు అవసరం లేదు.. అనుభూతి చెందాల్సిందే.. బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

ఆ క్షణాలకు మాటలు అవసరం లేదు.. అనుభూతి చెందాల్సిందే.. బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్ వైరల్!
Advertisement

Bellamkonda Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్న సాయి శ్రీనివాస్(Sai Srinivas) ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న సాయి శ్రీనివాస్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈయన తన ప్రేయసి కావ్య రెడ్డి(Kavya Teddy) తో కలిసి పెద్దల సమక్షంలో ఏడడుగులు వేశారు. వీరి వివాహం ఏప్రిల్ 29వ తేదీ తిరుపతిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లి వీడియోని షేర్ చేసిన బెల్లంకొండ..

ఇలా కావ్య సాయి శ్రీనివాస్ వివాహపు వేడుకలు కేవలం కొంతమంది అతిధులు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నప్పటికీ వీరి వివాహ రిసెప్షన్ మాత్రం హైదరాబాదులో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ తన పెళ్లికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈయన పెళ్లి వీడియోని కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన పెళ్లి గురించి కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

అందమైన క్షణాలకు మాటలు అవసరం లేదు..

Advertisement

ఇలా పెళ్లి వీడియోని షేర్ చేసిన సాయి శ్రీనివాస్ తన పెళ్లి తిరుమలలో చాలా సాంప్రదాయబద్ధంగా జరిగిందని తెలిపారు. కావ్య తన జీవితంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస కావ్యం అయిందని ఇది శ్రీనివాస కళ్యాణానికి చాలా దగ్గరగా అనిపించిందని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఈ పెళ్లి వీడియోని షేర్ చేసిన ఈయన “ప్రతి అందమైన క్షణానికి మాటలు అవసరం లేదు, కొన్నింటిని నిశ్శబ్దంగా అనుభూతి చెందాలి” అంటూ కాస్త భావోద్వేగానికి గురి అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్, వీరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

?igsh=MXFpamZjb2owenhvZw%3D%3D

Advertisement

పెళ్లి వేడుకలలో భాగంగా కొంతమంది సెలబ్రెటీలు మాత్రమే హాజరయ్యారు కానీ రిసెప్షన్ వేడుకలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా హాజరై సందడి చేశారు. ఇక శ్రీనివాస్ పెళ్లి చేసుకున్న కావ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే ఈమె బిజినెస్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నట్టు సోషల్ మీడియా సమాచారం. ఈమె నాచురల్ పద్ధతిలో చీరలను తయారు చేసే బిజినెస్ రన్ చేస్తున్నారని అలాగే లాయర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. బిజినెస్ ద్వారా నెలకు సుమారు కోటి రూపాయల వరకు ఈమె ఆదాయం పొందుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక కావ్య తండ్రి లాయర్ తన తాత జడ్జ్ కావడంతో ఈమె కూడా వృత్తిపరంగా లాయర్ అని సమాచారం. మరి కావ్య గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది తెలియాలి అంటే సాయి శ్రీనివాస్ తెలియజేయాల్సి ఉంది.

Also Read: మైక్రోఫైనాన్స్ వివాదం.. కోర్టు మెట్లెక్కిన సింగర్ మంగ్లీ!

Related News

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

జిమ్‌లో మాళవిక శర్మ హంగామా ..ఫొటో చూస్తే ఫ్యాన్స్ ఫిదా!

తాప్సీ ఎందుకింత కష్టం.. నీ వల్ల కాదులే – నెటిజన్స్ ట్రోల్స్!

ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు… నెగిటివిటీ పై కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి!

బన్నీతో ఆ ఒక్క సీన్.. వైష్ణవిచైతన్యకి చుక్కలు కనిపించాయట!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుమంత్!

గోవాలో సమీరా రెడ్డి ఫ్యామిలీ హంగామా.. మధ్యలో మొసలి ట్విస్ట్!

మా వైపు తప్పే లేదు.. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత ఫైర్

Big Stories

Advertisement
×