Malavika Sharma:హీరోయిన్ మాళవిక శర్మ షేర్ చేసిన జిమ్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, ట్రావెల్ మూమెంట్స్, ఫిట్‌నెస్ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటుందన్న సంగతి తెల్సిందే.
తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ “Back to Mumbai” అని క్యాప్షన్ పెట్టింది. దీంతో అసలు మాళవిక శర్మ ఎక్కడి నుంచి ముంబైకి తిరిగొచ్చింది? ఆమె ఏ ట్రిప్‌లో ఉంది? అంటూ ఆసక్తిగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్
ఈ ఫొటోలో మాళవిక శర్మ జిమ్‌లో వర్కౌట్ చేసిన తర్వాత మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ ఫోజిచ్చిన ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డార్క్ కలర్ టాప్, లైట్ కలర్ షార్ట్స్, స్పోర్ట్స్ షూస్‌తో ఫిట్‌నెస్ మోడ్‌లో కనిపించిన మాళవిక.. గ్లామర్ కంటే తన ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. సాధారణంగా హీరోయిన్లు తమ ఫొటో షూట్స్, ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. కానీ మాళవిక మాత్రం జిమ్ ఫొటోతోనే ఫ్యాన్స్‌ని పలకరించడం విశేషం.
మాళవిక శర్మకు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఆమె గ్లామర్ ఫొటోషూట్స్, ట్రావెల్ ఫొటోలు, ఫిట్‌నెస్ పోస్టులకు ఫాలోవర్స్ నుండి మంచి అప్లాజ్ వస్తుంది.
కెరీర్ విషయానికి వస్తే
మాళవిక శర్మ కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్‌లోకి నేల టిక్కెట్టు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నటిగా మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘రెడ్’ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో మాళవికకు తెలుగు ఆడియన్స్‌లో మరింత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలులో పెద్దగా కనబడనప్పటికి తమిళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది.
మాళవిక కెరీర్‌లో సినిమాలని కాస్త తగ్గించినప్పటికీ తన ఫొటోలు, ట్రావెల్ డైరీ, ఫిట్‌నెస్ రొటీన్‌తో అభిమానులని ఎప్పుడు అలరిస్తూనే ఉంటుంది.అందుకే ఆమె పెట్టే ప్రతి కొత్త పోస్ట్‌కి క్షణాల్లో లైక్స్, కామెంట్లు వస్తుంటాయి.
సరికొత్త ప్రాజెక్ట్స్ ఏమోస్తాయో
ఇక తాజా పోస్ట్ విషయానికి వస్తే.. ముంబైకి మళ్ళీ వచ్చానని చెప్పిన మాళవిక, తన ఫిట్‌నెస్ కాపాడుకునే క్రమంలో భాగంగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో “ట్రిప్ ముగిసింది.. మళ్లీ వర్కౌట్ మోడ్‌లోకి వచ్చేసింది” అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:బన్నీతో ఆ ఒక్క సీన్.. వైష్ణవిచైతన్యకి చుక్కలు కనిపించాయట!
మొత్తానికి పెద్దగా ఏమీ చెప్పకుండా ఒక్క చిన్న క్యాప్షన్‌తో మాళవిక శర్మ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. హీరోయిన్‌గా మంచి అవకాశాల కోసం చూస్తూనే.. సోషల్ మీడియాలో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్న మాళవిక శర్మ నుంచి సరికొత్త ప్రాజెక్ట్స్ ఏమోస్తాయో చూడాలి !