E-Paper
Advertisement

నట్టింట్లో స్విమ్మింగ్‌ పూల్.. ఇది కదా అసలైన లగ్జరీ అంటే!

నట్టింట్లో స్విమ్మింగ్‌ పూల్.. ఇది కదా అసలైన లగ్జరీ అంటే!
Advertisement

Home Pools : స్విమ్మింగ్ పూల్ అంటే ఎక్కడికో వెళ్ళాలి ..నెల నెల డబ్బులు కట్టాలి..వీలుంటే వెళ్ళాలి లేకపోతె మానెయ్యాలి. ..ఇక ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండాలంటే బాగా డబ్బుండాలి.ఇదీ ఒకప్పటి పరిస్థితి.కానీ ట్రెండ్ మారిందండి.కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే మన నట్టింట్లోనే తక్కువ ఖర్చులోనే నయా స్విమ్మింగ్ పూల్ ని అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు.ఎలా అంటారా చూసేయండి.

ఇంటి లోపల స్విమ్మింగ్ పూల్ డిజైన్

Advertisement

మాములుగా అందరు ఏమనుకుంటారంటే ఇంటి లోపల స్విమ్మింగ్ పూల్ డిజైన్ చేసుకోవాలంటే ఇల్లు చాలా పెద్దగా ఉండాలని.అక్కడే మీరు పూల్ లో కాలేస్తున్నారు.అవును …ఇప్పుడొచ్చిన ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఇంటి కాంపౌండ్ వాల్ పక్కన ఉండే సన్నని గల్లీని కూడా ఒక అందమైన ‘లాప్ పూల్’గా మార్చేసుకోవచ్చు మరి.అవును ..కేవలం నాలుగు నుంచి ఐదు అడుగుల వెడల్పు ఉన్నా సరే, అక్కడ చక్కటి పూల్‌ను నిర్మించి దానికి గ్లాస్ ఫినిషింగ్ ఇవ్వడం ద్వారా ఇంటి లుక్కే మారిపోతుంది.

మెట్ల కింద ఉండే ఖాళీ ప్లేసుని కూడా

Advertisement

ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్‌లో స్థలం లేకపోతే, అండర్‌గ్రౌండ్ సెల్లార్‌ను లేదా మెట్ల కింద ఉండే ఖాళీ ప్లేసుని కూడా అద్భుతంగా వాడుకోవచ్చు. ఇక్కడ రకరకాల ఎల్ఈడి లైటింగ్స్, ఫౌంటైన్లను అమర్చడం ద్వారా ఆ ప్రాంతాన్ని ఒక పర్సనల్ రిసార్ట్‌లా మార్చుకోవచ్చంటే నమ్మండి .దీనివల్ల ప్లేస్ వేస్ట్ కాకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా చిల్ అవ్వొచ్చు. ముఖ్యంగా రిలేటివ్స్ , ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఇండోర్ పూల్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి కూడా.

ఇంటి టెర్రస్ పైన ఆకాశం కనిపించేలా

అయితే ఈ మధ్య ప్రకృతిని ఇష్టపడుతూ, ఒంటరిగా ఉండాలని భావించేవారు రూఫ్‌టాప్ పూల్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి టెర్రస్ పైన ఆకాశం కనిపించేలా మొక్కల మధ్య ఈత కొడుతుంటే వచ్చే ఆ ఫీలింగే వేరు. పైన నీలి ఆకాశం, కింద చల్లని నీరు.. ఈ రెండింటి మధ్య గడిపే సమయం ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తుంది. టెర్రస్ పైన కాబట్టి పూల్ ఎంత ఉండాలి అనే విషయం పెద్దగా లెక్కలోకి రాదు. దీనికి తోడు పూల్ ఏ డిజైన్ ఉండాలి అనే దాంట్లో చాలా ఆప్షన్స్ వచ్చాయ్.మాములుగా మనమెప్పుడు స్క్వైర్ షేప్ లో ఉన్న పూల్స్ నే చూస్తుంటాం.అలా కాకుండా సర్కిల్ లేదా వంకర్లు తిరిగిన కర్వీ డిజైన్లతో కూడా పూల్‌ను నిర్మించుకోవచ్చు. పూల్ చుట్టూ అద్దాల గోడలు లేదా యాక్రిలిక్ షీట్లు వాడటం ద్వారా ఇల్లు మరింత మోడరన్ గా కనిపిస్తుంది కూడా..

ALSO READ :ఉ* పోయిస్తే కానీ.. ఆ చోటు నీది కాదు.. ఈ ఒక్క డైలాగ్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన సందీప్ కిషన్!

అయితే ఇలాంటి పూల్స్ నిర్మించేటప్పుడు భద్రత విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వారు ఆడుకోవడానికి వీలుగా సగం వరకు తక్కువ లోతు ఉండేలా డిజైన్ చేయించుకోవడం ఎంతో ఉత్తమం.

ఒక గంట ఈత కొట్టామంటే

కేవలం ఎంజాయ్ చేయడం కోసమే కాకుండా హెల్త్ పరంగా కూడా స్విమ్మింగ్ పూల్స్ ఇప్పుడు ఖచ్చితం అయిపోయాయ్. నగరాల్లో వాకింగ్ లేదా జాగింగ్ చేయడానికి సరైన ట్రాక్‌లు లేకపోవడం, కాలుష్యం పెరిగిపోవడంతో ఇంట్లోనే ఈత కొట్టడం అనేది మంచిది అన్నట్టుగా తయారైంది.ఇక రోజుకు ఒక గంట ఈత కొట్టామంటే బాడీలోని అన్ని కండరాలకు పని పడటమే కాకుండా, వెన్నునొప్పి వంటి ప్రాబ్లంస్ నుండి రిలాక్సేషన్ ఉంటుందని డాక్టర్స్ చెబుతుంటారు కూడా.

మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే హ్యాప్పీగా

ఇక వెదర్ చల్లగా ఉనప్పుడు కూడా ఈత కొట్టాలన్న కోరిక ఉంటె ‘టెంపరేచర్ కంట్రోల్’ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఈ సీజన్ అయినా స్విమ్మింగ్ పూల్ లో హాయిగా జలకాలు ఆడేయోచ్చు.ఇక టెంపరేచర్ కంట్రోల్’ సిస్టం ఏంటో ఖర్చు అవుతుంది అనుకుంటే అది పోరపాటే, అవును మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే హ్యాప్పీగా దొరికేస్తున్నాయ్ మరి.కావలసిందల్లా సరైనది పట్టుకునే ఓపిక.సో వేలకి వేలు తగలేసి భారీ స్విమ్మింగ్ పూల్స్ వైపు కాకుండా ఇలా చిన్న బడ్జెట్ లోనే ఇంట్లో ఈత సరదాని తీర్చేసుకోండి !

ALSO READ :నితిన్ మార్కెట్ అవుట్? భారీ బడ్జెట్‌తో రిస్క్ చేయలేక దర్శకుడికి షాక్!

Related News

కడుపు నిండా తిన్నా శరీరంలో శక్తి లేదా? మీరు చేసే తప్పులివే

కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి విషయంలో తమ అభిప్రాయం చెబుతుంటారు

వయసు పెరిగినా శరీరంలో చరుకుదనం తగ్గదు.. డాక్టర్ సూచించిన ఈ 6 అలవాట్లు పాటిస్తే

మీరు ఇంట్లోనే RO వాటర్ తాగుతున్నారా? అది విషపూరితం కావొచ్చు.. ఈ 3 సంకేతాలు గుర్తించండి

ఒకేసారి ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త ఈ కాంబినేషన్లు ప్రమాదకరం

80ల నాటి మన ఇళ్లలో దాగున్న అపురూపమైన జ్ఞాపకాలు.. ఇవి మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా?

గోలీలు, బొంగరాలతో ఆటలు.. నేటి ఆన్‌లైన్ గేమ్స్‌లో ఆ కిక్కేది?

80’s కిడ్స్.. ఫ్యాషన్ ఐకాన్స్, రెట్రో అంటే గుర్తొచ్చేది వీళ్ల స్టైలే!

Big Stories

Advertisement
×