Eshwar Sai: బాసింగ బలాలు, రాతిరి రాతిరి రాతిరిలో, ప్రమీల ఓ ప్రమీల అంటూ పలు ఫోక్ సాంగులతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈశ్వర్ సాయి (Eshwar Sai) అదే పాటలలో.. తనతో పాటు చిందాడిన మాధురి రాథోడ్ (Madhuri Rathod) తో ఏకాంతంగా ఆయన భార్యకు పట్టుబడి చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా మాధురి రాథోడ్ తప్పు లేదని ఈశ్వర్ సాయి చెప్పడం, మాధురి రాథోడ్ వల్ల తన భర్త ఇలా తయారయ్యాడు అంటూ ఈశ్వర్ సాయి భార్య శరణ్య (Saranya) పోలీసులను ఆశ్రయించడం, ఆ తర్వాత ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ కు క్షమాపణలు చెప్పడం, మోసం చేశాడనే నేపథ్యంతో మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం అన్నీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇలాంటి సమయంలో ఈశ్వర్ సాయిని.. నార్సింగి పోలీసులు అరెస్టు చేయాల్సి ఉండగా.. ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయనకి ముందస్తు బెయిల్ లభించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేకించి తెలంగాణ హైకోర్టులో ఆయన చొరవతోనే ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు ఈ మధ్యంతర ఉపశమనాన్ని కల్పించింది.. తోటి జానపద కళాకారిణి మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదయింది. ఇందులో భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 69 తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, 1989 లోని సెక్షన్ 3(2)(V) కింద కేసు నమోదు చేసినట్లు డాక్యుమెంట్లో పేర్కొన్నారు.
అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఈశ్వర్ సాయి క్రిమినల్ పిటిషన్ నంబర్ 14088/2026 ద్వారా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున ప్రముఖ లాయర్ నాగూర్ బాబు (Sk.Nagoor Babu) న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు, నిందితుడి మధ్య సంబంధం పరస్పర అంగీకారంతో స్వచ్ఛందంగా చాలాకాలం కొనసాగిందని, ఈశ్వర్ సాయి తరఫు న్యాయవాది నాగూర్ బాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు డాక్యుమెంట్లో పొందుపరిచారు. అలాగే ఈ కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని, దర్యాప్తుకు పూర్తిగా సహకరించేందుకు ఈశ్వర్ సాయి సిద్ధంగా ఉన్నారని ఆయన వాదించారు. ఆరోపణలు సంబంధిత చట్టపరమైన సెక్షన్ల వర్తింపు దర్యాప్తులో సేకరించే ఆధారాల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు.
ALSO READ:తాప్సీ ఎందుకింత కష్టం.. నీ వల్ల కాదులే – నెటిజన్స్ ట్రోల్స్!
ఇకపోతే ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేసులోని అంశాలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులకు లోబడి ఆయనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది . అదే సమయంలో కేసు దర్యాప్తు చట్ట ప్రకారం కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. ఇక ఇదే సమయంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన ఈశ్వర్ సాయిపై వచ్చిన ఆరోపణలపై కోర్టు తుది నిర్ణయానికి వచ్చినట్లు కాదని డాక్యుమెంట్లో స్పష్టంగా పేర్కొంది . ఆరోపణల వాస్తవాల దర్యాప్తు తదుపరి న్యాయ ప్రక్రియలో పరిశీలించాల్సి ఉంటుంది. జానపద కళా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు ఈ కేస్ తో సంబంధం కలిగి ఉండడంతో ఈ వ్యవహారం అటు ప్రజలలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా నాగూర్ బాబు వాదనలతోనే ఇప్పుడు ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ లభించినట్లు తెలుస్తోంది.