E-Paper
Advertisement

మా వైపు తప్పే లేదు.. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత ఫైర్

మా వైపు తప్పే లేదు.. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత ఫైర్
Advertisement

Dancers Association:డాన్సర్స్ అసోసియేషన్ లో గత రెండు నెలల కిందట మొదలైన వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా కనిపించట్లేదు.అసోసియేషన్‌ కి ఫెడరేషన్‌తో జరుగుతున్న చర్చలు, సభ్యులపై వచ్చిన ఆరోపణలు,అసోసియేషన్ లో ఏర్పడ్డ రెండు గ్రూపులు ..ఇలా అసోసియేషన్ వరుస ఘటనలతో మీడియాలో హైలెట్ అవుతున్నఈ క్రమంలో డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తాజాగా మీడియా ముందు చేసిన కామెంట్స్ ఇపుడు సెన్సేషన్ అవుతున్నాయి.

బ్యాంకుకు ఫోర్జరీ లేఖలు

Advertisement

అసోసియేషన్‌కు చెందిన కొంతమంది సభ్యులు బ్యాంకుకు ఫోర్జరీ లేఖలు ఇచ్చారని సుమలత ఆరోపించారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించారనే అంశంపై కోర్టు ఆర్డర్ కూడా వచ్చిందని ఆమె తెలిపారు. అసోసియేషన్ తరఫున తమ వైపు ఎలాంటి తప్పు జరగలేదని సుమలత స్పష్టం చేశారు.మొత్తంగా ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్ట్ పరిదిలో ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

పెద్దది చేసుకోవడం తమ ఉద్దేశం కాదు 

Advertisement

ఇక ఇదే సమయంలో ఫిల్మ్ ఫెడరేషన్‌తో కూడా చర్చలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. సమస్యను పెద్దది చేసుకోవడం తమ ఉద్దేశం కాదని, చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. లేబర్ కమిషన్ కూడా అవసరమైతే కొత్త డాన్సర్స్‌ను తీసుకోవచ్చని చెప్పినట్లు సుమలత చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితిపై సుమలత మాట్లాడుతూ కొన్ని రోజుల్లో అన్ని గొడవలు సద్దుమణిగిపోతాయని భావిస్తున్నామని ఆమె అన్నారు.

దీంతో ఈ వివాదం కేవలం అసోసియేషన్ పరంగానే కాకుండా, షూటింగ్స్‌కు సంబంధించిన టైమింగ్స్ , డాన్సర్స్ అవకాశాలు, యూనియన్ల మధ్య సరైన కో ఆర్డినేషన్ వంటి అంశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ‘మేము తప్పు చేస్తే భయపడాలి. మా సైడ్ ఎటువంటి తప్పు జరగలేదు’ అంటూ సుమలత చేసిన కామెంట్స్ ఇపుడు ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి.

త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి 

ఒకవైపు కోర్టు ఆర్డర్, మరోవైపు ఫెడరేషన్‌తో చర్చలు, ఇంకోవైపు లేబర్ కమిషన్ నుంచి వచ్చిన సూచనలు.. ఇవన్నీ కలిపి చూస్తే డాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఇప్పట్లో పూర్తిగా ముగిసినట్టు కనిపించడం లేదు. అయితే సుమలత మాత్రం త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ ఎండ్ కార్డ్ పడనుందో !

చివరికి ఈ వివాదం ఎలాంటి పరిష్కారానికి వస్తుంది? అసోసియేషన్ సభ్యుల మధ్య విభేదాలు తోలిగిపోతాయా ? ఫెడరేషన్‌తో చర్చలు సక్సెస్ అవుతాయా? కొత్త డాన్సర్స్‌కు అవకాశాలు కల్పించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది చూడాలి. ప్రస్తుతం మాత్రం సుమలత ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ALSO READ:నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

చూడాలి ముందు ముందు ఈ వివాదానికి ఎక్కడ ఎండ్ కార్డ్ పడనుందో !

Tags

Related News

‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా నచ్చలేదన్న అల్లరి నరేష్.. ఎందుకో తెలుసా?

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య స్పెషల్ రోల్ ? .. తెరపై తండ్రి-కొడుకుల మాస్ జాతర!

ఘనంగా సైమా 2026 అవార్డ్స్ వేడుక.. సత్తాచాటిన తెలుగు మూవీస్!

సీతమ్మ ఇలా మారిపోయిందేంటి..మృణాల్ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా!

ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!

టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ

హీరో అజిత్ ను కలిసిన సీఎం విజయ్.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×