C.M.Vijay -Trisha: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్, త్రిష జంట ఒకటి. వీరిద్దరూ పలు సినిమాలలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. అయితే కొంతకాలంగా విజయ్ త్రిష రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు అనుగుణంగానే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపించడం గమనార్హం. ఇక ప్రస్తుతం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికలలో ఈయన టీవీ కె పార్టీ తరఫున పోటీ చేయడం పోటీచేసిన మొదటిసారి ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక విజయ్ సీఎం అయిన తర్వాత కూడా త్రిష విజయ్ వెంట కనిపిస్తుండటం గమనార్హం. విజయ్ ప్రమాణ స్వీకారం రోజు, అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా త్రిష పాల్గొన్నారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పెట్టుబడుల కోసం విజయ్ లండన్ వెళ్ళగా త్రిష కూడా అక్కడే ఉండడంతో వీరిద్దరూ జంటగా మరోసారి కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
త్రిష తన సినిమా షూటింగ్లో భాగంగా లండన్ లో ఉన్నారు. ఇదే సమయంలోనే విజయ్ సైతం లండన్ వెళ్లడమే కాకుండా లండన్ లో సిల్వర్ స్టోన్ కార్ రేసింగ్ ఈవెంట్ లో పాల్గొంటున్న నటుడు అజిత్ ను కలిశారు. ఇలా సీఎం విజయ్ అజిత్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి అదే సమయంలో త్రిష కూడా అదే ఈవెంట్ లో ఉండటం విశేషం. ఇక ఈ వీడియో పై నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నప్పటికీ వీరి రిలేషన్ విషయాన్ని బయట పెట్టకపోవడంతో విమర్శలు కురిపిస్తున్నారు.
Thalapathy Vijay didn't expected her entry ? He looks UNCOMFORTABLE right after the moment trisha entered the frame 👀#Thalapathy #Vijay #Ajithkumar #TVK pic.twitter.com/2lDJpW5hnP
— Gokul (@ItzGokulVJ) September 12, 2026
ఇలా జంటగా పలు సందర్భాలలో కనిపిస్తున్నటువంటి విజయ్ త్రిషను ఉద్దేశిస్తూ ఇకపై మీ రిలేషన్ కన్ఫామ్ చేయొచ్చుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక విజయ్ త్రిష రిలేషన్ లో ఉన్నప్పటికీ వీరి రిలేషన్ అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణం విజయ్ భార్యా సంగీత(Sangeetha) అని చెప్పాలి. వీరి వ్యవహారం కారణంగానే సంగీత విజయ్ మధ్య విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. గతంలో సంగీత తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇటీవల ఆమె ఈ విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఇలా సంగీత నుంచి విడాకులు వచ్చిన అనంతరం విజయ్ త్రిష రిలేషన్ కన్ఫర్మ్ చేయాలని భావించారు కానీ సంగీత ఊహించని విధంగా విడాకులను ఉపసంహరించుకోవడం గమనార్హం.
Also Read: ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు… నెగిటివిటీ పై కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి!