E-Paper
Advertisement

గోవాలో సమీరా రెడ్డి ఫ్యామిలీ హంగామా.. మధ్యలో మొసలి ట్విస్ట్!

గోవాలో సమీరా రెడ్డి ఫ్యామిలీ హంగామా.. మధ్యలో మొసలి ట్విస్ట్!
Advertisement

Sameera Reddy:సమీరా రెడ్డి .. ఇప్పటి ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేకపోవచ్చు కాని రెండు దశాబ్దాల క్రితం ఈ భామ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమీరా.. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.తాజాగా గోవాలో ఫ్యామిలీతో కలిసి చేసిన ఓ ట్రిప్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

కుటుంబంతో కలిసి సందడి

వీకెండ్‌ను కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన సమీరా రెడ్డి.. గోవాలోని సియోలిమ్ బ్యాక్‌వాటర్స్‌కు వెళ్లింది. అక్కడ పిల్లలతో కలిసి బోట్ రైడ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. సాధారణంగా గోవా అంటే బీచ్‌లు, పార్టీలు, నైట్ లైఫ్ గుర్తొస్తాయి. కానీ సమీరా మాత్రం అందుకు భిన్నంగా పీస్ ఫుల్ గా ఉండే బ్యాక్‌వాటర్స్‌లో కుటుంబంతో కలిసి సందడి చేసింది.

Advertisement

అయితే ప్యామిలీతో కలిసి బోట్ రైడ్ చేస్తున్న సమయంలో ఒడ్డున ఓ మొసలి కనిపించింది. దీంతో పిల్లలు కూడా ఆ మొసలిని ఆసక్తిగా చూసినట్టు సమీరా షేర్ చేసిన వీడియోలో కనిపించింది. చివర్లో అందమైన సన్ సెట్ ని కూడా క్యాప్చర్ చేసింది.

ఈ సందర్భంగా సమీరా చేసిన కామెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జీవితంలో పనులు, బాధ్యతలు అంటూ పరుగులు పెట్టకుండా.. అప్పుడప్పుడు ప్రస్తుత క్షణాలన్ని ఆస్వాదించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. తనకు కూడా ఎప్పుడూ చేయాల్సిన పనుల లిస్ట్‌ గురించే ఆలోచన వస్తుంటుందని, కానీ ఇలాంటి సందర్భాల్లో దాన్ని పక్కన పెట్టి కుటుంబంతో గడిపే క్షణాలను ఆస్వాదించాలని తనకు తానే గుర్తు చేసుకుంటానని చెప్పింది.

జ్ఞాపకాలను సృష్టించుకోవడం ఎంతో ముఖ్యం 

‘Crocodiles & Rainbows’ అంటూ ఈ గోవా ట్రిప్‌కు సంబంధించిన వీడియోను సమీరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుత క్షణంలో ఉండటం, చేయాల్సిన పనుల గురించి కాసేపు మర్చిపోవడం, మనసుతో ఆ క్షణాన్ని ఆస్వాదించడం, జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించుకోవడం ఎంతో ముఖ్యమని ఆమె తన పోస్టులో పేర్కొంది. సియోలిమ్ బ్యాక్‌వాటర్స్‌లో ఇలాంటి అందమైన క్షణాలను కుటుంబంతో కలిసి గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది.

సినిమాల విషయానికి వస్తే

సమీరా రెడ్డి సినిమాల విషయానికి వస్తే.. ఆమె కెరీర్‌లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ లోనూ మంచి స్థానం సంపాదించుంచుకుంది. తెలుగులో ఆమె చేసిన ‘అశోక్’ మంచి పేరు తెచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్‌గా కనిపించింది. అలాగే ‘జై చిరంజీవ’లో చిరంజీవితో కలిసి నటించింది. ఆ తర్వాత హిందీలో ‘ముసాఫిర్’, ‘దే దనా దన్’, ‘రేస్’ వంటి సినిమాల్లో కూడా కనిపించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా యాక్షన్, గ్లామర్ పాత్రల్లో సమీరా అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తన తండ్రి 93వ పుట్టినరోజు సందర్భంగా

ఇక సమీరా తండ్రి రెడ్డి గారి విషయంలోనూ ఆమెకు ఉన్న అనుబంధం ఎంత ప్రత్యేకమో మరోసారి సోషల్ మీడియా ద్వారా చూపించింది. ఆగస్టు 12న తన తండ్రి 93వ పుట్టినరోజు సందర్భంగా సమీరా ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసింది. ప్రతి ఏడాది తన తండ్రి బర్త్‌డే కోసం వీడియో చేయడం తనకు ఎంతో ఇష్టమని, ఇలాంటి వీడియోలు మరెన్నో సంవత్సరాలు చేయాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పింది.

93 ఏళ్ల వయసులోనూ తన తండ్రి యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండటానికి కారణం ఏంటని అడిగినప్పుడు.. చిన్న వయసులో ఉన్నట్టే మనసును ఉంచుకోవడం, కుటుంబం నుంచి లభించే ప్రేమ తనకు బలాన్నిస్తాయని ఆయన చెప్పిన విషయాన్ని కూడా పంచుకుంది సమీరా .

Tags

Related News

బన్నీతో ఆ ఒక్క సీన్.. వైష్ణవిచైతన్యకి చుక్కలు కనిపించాయట!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుమంత్!

మా వైపు తప్పే లేదు.. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత ఫైర్

‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా నచ్చలేదన్న అల్లరి నరేష్.. ఎందుకో తెలుసా?

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య స్పెషల్ రోల్ ? .. తెరపై తండ్రి-కొడుకుల మాస్ జాతర!

ఘనంగా సైమా 2026 అవార్డ్స్ వేడుక.. సత్తాచాటిన తెలుగు మూవీస్!

సీతమ్మ ఇలా మారిపోయిందేంటి..మృణాల్ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×