Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య..ఎపిక్ సినిమాతో ఈ మధ్యే ఆడియన్స్ ని పలకరించిన ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌లో జరిగిన క్రేజీ ఇన్సిడెంట్ ని బయటపెట్టింది.తన కెరీర్ తొలినాళ్ళలో ఏకంగా 20 టేకులు తీసుకున్నా షాట్ ఓకే కాకపోవడంతో తను ఎంత టెన్షన్ పడ్డానో చెప్పుకొచ్చింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’లో అల్లు అర్జున్‌తో కలిసి ఓ సీన్ చేసే అవకాశం వచ్చిందట. అందులో తనకు ఆ సీన్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదని.. కేవలం ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాల్సి వచ్చిందని వైష్ణవి గుర్తు చేసుకుంది. బన్నీ తన డైలాగ్ చెప్పిన తర్వాత తాను రియాక్ట్ అవ్వాల్సిన సీన్ అని అయితే ఎంత ప్రయత్నించినా రావడం లేదని వాపోయింది.అలా ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 20 టేకులు తీసుకున్నా సీన్ సరిగ్గా రాలేదని ఆమె చెప్పుకొచ్చింది.
తనపై మరింత ప్రెజర్
అంతేకాదు, అక్కడే అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇద్దరూ ఉండటంతో తనపై మరింత ప్రెజర్ పెరిగిందని చెప్పింది. డైలాగ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కేవలం చప్పట్లు కొట్టి ఓ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాల్సిన సీన్ మాత్రమే. కానీ ఆ చిన్న మూమెంట్ కూడా తన వల్ల కావడం లేదని వైష్ణవి ఫీల్ అయిందట.
ఆ సమయంలో త్రివిక్రమ్‌ను ఆ ఎక్స్‌ప్రెషన్ చేసి చూపించమని అడిగిందట వైష్ణవి. దానికి త్రివిక్రమ్“నాకు తెలిస్తే చూపించేవాడ్ని కదా.. నువ్వే ప్రయత్నించు” అంటూ తననే ట్రై చేయమని చెప్పారట. దీంతో ఇంకా టెన్షన్ పెరిగిందని ఆమె చెప్పింది. అయితే పరిస్థితిని గమనించిన అల్లు అర్జున్ వెంటనే మధ్యలోకి వచ్చి ఆమెను రిలాక్స్ చేయడానికి ప్రయత్నించారట.
బన్నీ చెప్పడంతో చాలా రిలీఫ్
“టెన్షన్ పడొద్దు. ఈరోజు సీన్ రాకపోతే రేపు చేద్దాం” అంటూ బన్నీ చెప్పడంతో తనకు చాలా రిలీఫ్ అనిపించిందని వైష్ణవి తెలిపింది. అప్పటివరకు ఎక్స్‌ప్రెషన్ రావాలనే ఒత్తిడిలో ఉన్న ఆమెకు బన్నీ ఇచ్చిన ఆ మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చాయట. ఆ తర్వాత కేవలం రెండు మూడు టేకుల్లోనే తనకు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్ వచ్చేసిందని చెప్పింది.
తన కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక టేకులు తీసుకున్న సన్నివేశం అదే అని వైష్ణవి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అందులో డైలాగ్ కూడా లేకపోవడంతో కేవలం ఎక్స్‌ప్రెషన్ కోసం ఇన్ని టేకులు తీసుకోవడం తనకే చాలా గలీజుగా అనిపించిందని సరదాగా చెప్పుకొచ్చింది.మొత్తానికి సీన్ చిన్నదే అయినా.. అప్పట్లో తనకు మాత్రం అది పెద్ద పరీక్షలా మారిందన్నమాట.
చిన్న పాత్రలో కనిపించిన వైష్ణవి చైతన్య
‘అల వైకుంఠపురములో’ సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి సమయంలో భారీ విజయం సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సముద్రఖని, టబు, జయరామ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా సినిమాలోని పాటలు, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
ఎపిక్ సినిమాతో పలకరింపు
ఆ తర్వాత వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ‘బేబీ’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కల్ట్ హిట్ గా పేరు తెచ్చుకుంది.
తర్వాత ‘లవ్ మీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవి..ప్రస్తుతం ఎపిక్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించింది.ఏది ఏమైనా చిన్న చిన్న పాత్రలతో ఈస్థాయికి రావడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయమే !
ALSO READ:గోవాలో సమీరా రెడ్డి ఫ్యామిలీ హంగామా.. మధ్యలో మొసలి ట్విస్ట్!