E-Paper
Advertisement

అంగరంగ వైభవంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

అంగరంగ వైభవంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!
Advertisement

Bellam Konda sai Srinivas: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరొక హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్(Sai Srinivas) బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈయన కావ్య రెడ్డి(Kavya Reddy) అనే అమ్మాయితో ఏడు అడుగులు నడవబోతున్న సంగతి తెలిసిందే. గత నెల క్రిందట వీరిద్దరూ తమ పెళ్ళికి సంబంధించిన విషయాన్ని అధికారకంగా తెలియజేశారు.

నిశ్చితార్థం చేసుకున్న సాయి శ్రీనివాస్ కావ్య..

గత నెల బంధువుల సమక్షంలో రోక వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ జంట నేడు హైదరాబాద్ ని తమ ఫామ్ హౌస్ లో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం(Engagment) జరుపుకున్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో , బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరినిచ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిని నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

తిరుపతిలో వివాహం..

Advertisement

ఇలా హైదరాబాదులో సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఈనెల 29వ తేదీ తిరుపతిలో వివాహం చేసుకోబోతున్నారు. ఇక వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగబోతుందని తెలుస్తుంది. తిరుపతిలో సింపుల్ గా పెళ్లి చేసుకొని ఈ జంట తిరిగి మే ఒకటవ తేదీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకుల కోసం రిసెప్షన్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఇక త్వరలోనే పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

టైసన్ నాయుడు..

Advertisement

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ విషయానికి వస్తే ఈయన ప్రముఖ నిర్మాత సురేష్ కుమారుడిగాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన నటన నైపుణ్యంతో ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కకున్నారు. అల్లుడు శీను అని సినిమా ద్వార హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి శ్రీనివాస్ అనంతరం సూపర్ హిట్ సినిమాలలో నటించారు . ఇక గత ఏడాది ఈయన భైరవం, కిష్కిందపురి అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన ఖాతాలో మరో రెండు హిట్ సినిమాలను వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన టైసన్ నాయుడు అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్, నభా నటే ష్ హీరోయిన్లుగా నటించబోతున్నారు.

Also Read: ధనుష్ లో మా నాన్నను చూసుకున్నా.. గొడవపడి తప్పు చేశా: విగ్నేష్ శివన్

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×