E-Paper
Advertisement

బతుకు చక్రం తిప్పిన తోపుడు బండి… ఒక ఖతర్నాక్ టైలర్ కథ

బతుకు చక్రం తిప్పిన తోపుడు బండి… ఒక ఖతర్నాక్ టైలర్ కథ
Advertisement

Comedy Movie OTT : కొన్ని సినిమాలను తక్కువ బడ్జెట్ తో తీసినా ప్రశంసలు అందుకుంటాయి. అవార్డులను కూడా దక్కించుకుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇది కామెడితో పాటు, ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంటుంది. ఒక పాత కాలపు టైలర్ ప్రతి ఇంటికి తిరిగి బట్టలు కుట్టడం ఇందులో విశేషం. ఇది కేవలం బట్టలు కుట్టే టైలర్ కథ మాత్రమే కాదు.. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనం ఎలా మారాలి, కష్టాల్లో ఉన్నప్పుడు కొత్తగా ఎలా ఆలోచించాలి అనే అంశాలను చాలా చక్కగా చూపిస్తుంది. ఈ సినిమా మొత్తం గ్రీస్ రాజధాని అయిన ఏథెన్స్ లోనే షూట్ చేశారు. సినిమాని చూస్తే తప్పకుండా ఓ మంచి ఫీలింగ్ వస్తుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2020లో వచ్చిన ఈ ఫీల్ గుడ్ కామెడీ సినిమా పేరు ‘టైలర్’ (Tailor). దీనిని డైరెక్ట్ చేసిన సోనియా లిజా కెంటర్మాన్ కు ఇది మొదటి సినిమా. ఒక చిన్న పాయింట్‌తో హృదయాన్ని హత్తుకునేలా సినిమా తీసి ఇంటర్నేషనల్ లెవల్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఇందులో నికోస్ పాత్రలో నటించిన డిమిత్రిస్ ఇమెల్లోస్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ఈ సినిమా గ్రీక్ ఫిల్మ్ అకాడమీ నుండి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్ లాంటి అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ప్లెక్స్ (Plex) ప్లాట్‌ఫామ్స్‌లో చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నికోస్ అనే ఒక టైలర్ తన తండ్రితో కలిసి ఏథెన్స్ నగరంలో ఒక బట్టల షాపు నడుపుతుంటాడు. వీళ్లది పాత కాలపు పద్ధతి, పైగా రేట్లు కూడా ఎక్కువే. కానీ కాలం మారింది, జనాల దగ్గర డబ్బుల్లేవు, బ్యాంకువాడేమో షాపును జప్తు చేస్తానని నోటీసులు ఇస్తాడు. అప్పులు పెరిగిపోయి, తండ్రికి ఒంట్లో బాగోకపోయేసరికి.. అసలు బతుకు బండి ఎలా లాగాలా అని నికోస్ తల పట్టుకుంటాడు. ఖాళీగా కూర్చుంటే కడుపు నిండదని డిసైడ్ అయిన నికోస్, ఒక మాంచి ఐడియా వేస్తాడు. తన కుట్టు మిషన్ తీసుకెళ్లి ఒక తోపుడు బండి మీద పెట్టి, వీధి వీధికీ తిరుగుతూ బట్టలు కుట్టడం మొదలుపెడతాడు. అంటే మొబైల్ టైలర్ షాప్ అన్నమాట.

రోడ్డు మీద నిలబడి బట్టలు కుడుతూ మెల్లమెల్లగా ఫేమస్ అవుతాడు. అప్పుడే అతనికి ఒక లేడీ కస్టమర్ పరిచయమై, తన కూతురి పెళ్లికి గౌను కుట్టమని అడుగుతుంది. నికోస్‌కు అంతకుముందు ఆడవాళ్ల బట్టలు కుట్టిన అనుభవం లేకపోయినా, మొండి ధైర్యంతో రంగంలోకి దిగుతాడు. తన దగ్గర ఉన్న పాత మెటీరియల్స్‌తోనే అదిరిపోయేలా పెళ్లి గౌన్లు కుట్టడం నేర్చుకుంటాడు. సిటీ బయట ఉండే పేద జనం కోసం తక్కువ రేటుకే గ్రాండ్ లుక్ వచ్చేలా డ్రెస్సులు కుట్టి అందరి మనసు గెలుచుకుంటాడు. కష్టాల్లో ఉన్న తన ఫ్యామిలీని తన టాలెంట్‌తో ఎలా గట్టెక్కించాడన్నదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : కళ్ళముందే మాయమైన కొడుకు… ఓటీటీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని అందుకున్న జర్మన్ యాక్షన్ థ్రిల్లర్

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×