E-Paper
Advertisement

Bhagyashree Borse : ఫ్లాపులున్నా సరే ఆమె కావాలట.. మరో స్టార్ హీరో సరసన భాగ్యశ్రీ బోర్సే

Bhagyashree Borse :  ఫ్లాపులున్నా సరే ఆమె కావాలట.. మరో స్టార్ హీరో సరసన భాగ్యశ్రీ  బోర్సే
Advertisement

Bhagyashree Borse : రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’సినిమా వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది ఒక్క హీరోయిన్ మాత్రమే. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్య‌శ్రీ బోర్సే, తన తొలి సినిమాతోనే భాగ్య‌శ్రీ బోర్సే అదరగొట్టింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్య‌శ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో తన అందాలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. మాస్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.

సినిమాలో అమ్మడు అందాలను ఆరబోసింది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. నిజానికి ‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ, హీరోయిన్‌గా భాగ్యశ్రీకి మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో సినిమా ఫ్లాప్ అయినా, ఈ అమ్మడికి ఆఫర్లు మాత్రం క్యూ కట్టాయి.

Advertisement

వరుసగా స్టార్ హీరోలతో ఛాన్సులు
ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘కింగ్‌డమ్’ అనే భారీ ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా కూడా మిశ్రమ స్పందన పొందినప్పటికీ, భాగ్యశ్రీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వెనువెంటనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలిసి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమాలో మెరిసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు, అందానికి మంచి గుర్తింపు లభించింది. ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ‘కాంత’ అనే ద్విభాషా చిత్రంలో నటించి తన ప్రతిభను చాటుకుంది.

సూర్య సినిమాలో ఛాన్స్?
ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే గురించి ఫిల్మ్ నగర్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రంలో ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, భాగ్యశ్రీ కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కినట్లే. హిట్లతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ వయ్యారి భామ, త్వరలోనే ఒక భారీ సక్సెస్ కొట్టి టాలీవుడ్ నంబర్ వన్ రేసులోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

Big Stories

Advertisement
×