E-Paper
Advertisement

Nobody 2 OTT Movie : ఓటీటీలోకి ఆ సీన్లున్న కొత్త మూవీ… కానీ డిసప్పాయింట్మెంట్ తప్పదు

Nobody 2 OTT Movie : ఓటీటీలోకి ఆ సీన్లున్న కొత్త మూవీ… కానీ డిసప్పాయింట్మెంట్ తప్పదు
Advertisement

Nobody 2 OTT Movie : అల్టిమేట్ యాక్షన్ సీన్లు ఉన్న ఓ హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఈ వారం పాపులర్ నటుడు బాబ్ ఓడెన్‌ కిర్క్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ “నోబడీ” సీక్వెల్‌తో ఓటీటీ సందడి ప్రారంభమయ్యింది. కానీ ఈ సినిమా పెద్దలకు మాత్రమే. మరి ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

‘నోబడీ 2’ ఈ ఓటీటీలోనే… 

‘నోబడీ 2’ (Nobody 2) మూవీ డిసెంబర్ 22 సోమవారం నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. హాలీవుడ్ యాక్షన్ డ్రామా ‘నోబడీ’కి సీక్వెల్‌ ఇది. మొదటి భాగానికి బాబ్ ఓడెన్‌ కిర్క్ దర్శకత్వం వహించారు. ఇందులో ఒక తండ్రిగా, హంతకుడిగా హీరో ఓడెన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక థియేటర్లలో సగటు వసూళ్లు సాధించిన ‘నోబడీ 2’ చిత్రానికి టిమో ట్జాజంటో దర్శకత్వం వహించారు. 87 నార్త్ ప్రొడక్షన్, ఓడెన్‌కిర్క్ ప్రొవిస్సిరో ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించారు. గతంలో ఈ సినిమా భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడ్‌లో మాత్రమే స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే హిందీ వెర్షన్ ను కూడా యాడ్ చేశారు. అయితే తెలుగు వెర్షన్ మాత్రం ఓటీటీలో అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఈ చిత్రంలో ఓడెన్‌ కిర్క్‌ తో పాటు కోనీ నీల్సన్ బెక్కాగా, క్రిస్టోఫర్ లాయిడ్ డేవిడ్‌గా నటించారు. కాలిన్ సాల్మన్, గేజ్ మున్రో, పైస్లీ కాడోరత్ కూడా మరోసారి సీక్వెల్ లో తమ పాత్రలను తిరిగి పోషించారు.

Advertisement

Read Also :  అద్దంలో బందీగా భార్య… ఆమె కళ్ల ముందే మరో అమ్మాయితో భర్త… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

కథలోకి వెళ్తే…

ఈ కథ హచ్ మాన్సెల్ చుట్టూ తిరుగుతుంది. అతనికి రెండు విభిన్న గుర్తింపులు ఉంటాయి. ఇంట్లో, కుటుంబంలో అతను ఒక అతిగా పని చేసే తండ్రి. కానీ అతనిలో ఫ్యామిలికి తెలియని మరో యాంగిల్ కూడా ఉంటుంది. ఈ సైలెంట్ తండ్రి ఒక సైలెంట్ కిల్లర్ గా మారతాడు. ఇదంతా ఫస్ట్ పార్ట్ స్టోరీ. మొదటి భాగం తర్వాత, హచ్ అప్పులు తీర్చడానికి కిల్లర్ ‌గా కంటిన్యూ అవుతాడు. దీంతో ఆయన భార్య దూరం అవుతుంది. ఆ తరువాత మళ్ళీ కుటుంబంతో తిరిగి కలవడానికి, హచ్ చిన్ననాటి వాటర్ పార్క్‌కు వెళ్లాలని అనుకుంటాడు. అలాగే తన హింసాత్మక జీవితాన్ని వదిలి పెట్టి, మంచి ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటానని భార్యకు మాట కూడా ఇస్తాడు. పార్క్‌ కు వెళ్ళాక అతని కొడుకు విషయంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవలో హచ్ జోక్యం చేసుకుంటాడు. ఇదంతా పార్క్ యజమాని, అవినీతిపరుడైన షెరీఫ్, లెండిన అనే నేరస్థురాలి వరకు వెళ్తుంది. షెరీఫ్ హచ్ ‌ను చంపడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే హచ్ ఆ పార్క్ లో జరుగుతున్న ఓ పెద్ద స్మగ్లింగ్ గురించి తెలుసుకుంటారు. హచ్ తండ్రి (డేవిడ్), భార్య (బెక్కా)లను కూడా టార్గెట్ చేస్తారు. దీంతో హచ్ భార్య బేక్కా ఒక షాకింగ్ పని చేస్తుంది. మరి ఇంతకీ బెక్కా ఏం చేసింది? తనను టార్గెట్ చేసిన వాళ్ళను హచ్ ఏం చేశాడు? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

Big Stories

Advertisement
×