Bhagya Sri borse:భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse).. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రవితేజ (Raviteja ) హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. అమ్మడి అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కింగ్డమ్ (Kingdom) సినిమాలో అవకాశాన్ని కొట్టేసింది. దీనికి తోడు రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది భాగ్యశ్రీ బోర్సే.
యంగ్ హీరోలతో ఛాన్స్ కొట్టేస్తున్న భాగ్యశ్రీ..
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ ను బుట్టలో వేసుకుందని.. అతనితో డేటింగ్ చేస్తోంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరొకవైపు అక్కినేని అఖిల్ (Akhil) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమాలో కూడా ఇప్పుడు ఈమెనే తీసుకున్నారు. వాస్తవానికి మొదటి శ్రీలీలను హీరోయిన్గా తీసుకున్నప్పటికీ.. ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆమెను తప్పించి, ఆమె ప్లేస్ లో భాగ్యశ్రీ కి అవకాశం కల్పించారు అంటూ వార్తలు వస్తున్నాయి ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.
బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ..
ఇక అలా వరుసగా తెలుగు హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మకు.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా నేచురల్ స్టార్ నాని (Nani) తో నటించే అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ‘హిట్ 3’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాని.. ప్రస్తుతం ‘దసరా’ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా కోసం మళ్లీ జతకట్టారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సికింద్రాబాద్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నాని నటిస్తున్నట్లు తెలుసు కానీ మిగతా క్యాస్టింగ్ గురించి ఎక్కడా కూడా డైరెక్టర్ రివీల్ చేయకుండా పక్కా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజమైతే.. అమ్మడికి తిరిగి ఉండదుగా..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో నాని పక్కన ఎవరైతే బాగుంటారని డైరెక్టర్ శ్రీకాంత్ పరిశీలిస్తూ ఉండగా.. భాగ్యశ్రీ అయితే బాగుంటుందని ఆమెని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలతో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో నాని సరసన నటించే అవకాశాన్ని కొట్టేసిందని తెలిసి.. ఇక ఈమెకు తిరుగు ఉండదని ఈ సినిమా విజయం సాధించింది అంటే కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో భాగ్యశ్రీ కి గుర్తింపు లభిస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది. మొత్తానికైతే భాగ్యశ్రీ వరుస పెట్టి తెలుగు హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశానికి మరింత దగ్గరలో ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ALSO READ:Sania Mirza: టాలీవుడ్ స్టార్ హీరోతో సానియా పెళ్ళా.. క్లారిటీ వచ్చేసింది!