E-Paper
Advertisement

నీ కష్టానికి ఫలితం దక్కబోతోంది… నాగచైతన్యకు కార్తీక్ వర్మ ఎమోషనల్ బర్త్ డే విషెస్

నీ కష్టానికి ఫలితం దక్కబోతోంది… నాగచైతన్యకు కార్తీక్ వర్మ ఎమోషనల్ బర్త్ డే విషెస్
Advertisement

Karthik varma: కార్తీక్ వర్మ దండు విరూపాక్ష సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తన తదుపరి చిత్రాన్ని అక్కినేని హీరో నాగచైతన్య(naga chaitanya)తో వృషకర్మ (Vrusha Karma )అనే సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కార్తీక్ వర్మ(karthik varma ) నాగచైతన్య సినీ కెరియర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నాగచైతన్యకు స్పెషల్ విషెస్..

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే నటుడు నాగచైతన్య నవంబర్ 23వ తేదీ తన పుట్టిన రోజు (Birthday)వేడుకలను జరుపుకున్నారు. ఇలా తను 40వ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ కార్తీక్ వర్మ నాగచైతన్య గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక్ వర్మ వృషకర్మ సినిమాకి సంబంధించిన పోస్టర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ…

మూడు సంవత్సరాల క్రితం ప్రయాణం మొదలు..

Advertisement

ఈ ప్రపంచానికి మేమిద్దరం ఇంట్రోవర్ట్స్ కానీ మేమిద్దరం ఉన్నప్పుడు మాత్రం మాలోని అసలు వ్యక్తిత్వం బయటకు వస్తుందని మా ప్రయాణంలో ఇదే అద్భుతం అంటూ తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం మేమిద్దరం దర్శకుడిగా హీరోగా మా ప్రయాణాలను మొదలుపెట్టాము. ఈ ప్రయాణంలో మాకు తెలియకుండానే మేము స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా, ఒకరు క్షేమం మరొకరు కోరుకునే వారిగా మారిపోయాము. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రతి చిన్న విషయాన్ని కలిసి జరుపుకోవడం, సినిమా కంటే ఒక గొప్ప బంధం మా మధ్య ఏర్పడింది.

Advertisement

వృషకర్మ సినిమా విషయంలో మీ మద్దతు, మీ శ్రమ, ప్రతి ఫ్రేమ్ కోసం మీరు పడిన కష్టం ఇవన్నీ నాకు ఎంతో విలువైనవి. ప్రతిఫలం ఆశించకుండా ఎంతో కష్టపడి పని చేశారు. మీ ఈ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కబోతోంది. డిసెంబర్ 4వ తేదీ వెండితెరపై మీలో ఉన్న ఒక కొత్త రూపాన్ని అందరూ చూడబోతున్నారు. వృషకర్మ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ఎంతో గొప్ప మనసున్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కార్తీక్ వర్మ సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ ఈ సినిమా ప్రయాణంలో నాగచైతన్యతో తనకి ఏర్పడిన బాండింగ్ గురించి తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Also Read: బిగ్ బాస్ 10 లో పొలిటికల్ గేమ్స్.. సీక్రెట్ బయట పెట్టిన శివాజీ!

 

Related News

ఆరెంజ్ చీరలో అదరగొట్టిన శ్రద్ధా కపూర్.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సినిమా ప్రమోషన్ల కోసం చేతబడి చేసిన హీరోలు.. షాక్ లో నిర్మాత!

చిన్నప్పుడు విన్న భయంకరమైన కథే ‘భోగి’కి స్ఫూర్తి.. అసలు విషయం బయటపెట్టిన సంపత్ నంది!

ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్!

శర్వానంద్ భోగి ఫస్ట్ రివ్యూ.. అసలేముంది ఇందులో?

ప్రీ స్కూల్ లోకి అడుగుపెట్టిన క్లీంకారా.. ఉపాసన – రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్స్ వైరల్!

బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘దాదా’పై నో టెన్షన్..!

Big Stories

Advertisement
×